Grammy Awards2023: మూడో గ్రామీ అవార్డు గెలుచుకున్న రిక్కీ కేజ్

Grammy Awards2023: మూడో గ్రామీ అవార్డు గెలుచుకున్న రిక్కీ కేజ్

బెంగళూరుకు చెందిన ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్ కు మూడోసారి గ్రామీ అవార్డు దక్కింది. తన లేటెస్ట్ ఆల్బమ్ డివైన్ టైడ్స్ కు ఈ అవార్డ్ లభించింది. ప్రతిష్టాత్మకమైన గ్రామీ అవార్డ్ కోసం ప్రపంచ నలుమూలల నుంచి వందలమంది మ్యూజిక్ కంపోజర్స్ నామినేట్ అవుతారు. అందులో బెస్ట్ ఇమ్మర్సివ్ ఆడియో ఆల్బమ్ విభాగంలో రిక్కీ ఈ అవార్డు గెలుచుకున్నాడు. ఈ ఆల్బమ్ లో 9 పాటలు, 8 మ్యూజిక్ వీడియోలు ఉన్నాయి. 

మన దేశం తరుపున గ్రామీ అవార్డు గెలుచుకున్న అతిపిన్న వయస్కుడిగా, 4వ భారతీయుడిగా విక్కీ రికార్డు నెలకొల్పాడు. రిక్కీకి 2015 విండ్స్ ఆఫ్ సంసార, 2022 వచ్చిన వందే భారతమ్ ఆల్బమ్స్ కి గ్రామీ అవార్డ్స్ వచ్చాయి. ఈ 65వ గ్రామీ అవార్డ్స్ ప్రదానోత్సవాలు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరుగుతున్నాయి.