డబుల్ ఇస్మార్ట్ కు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.. ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

డబుల్ ఇస్మార్ట్ కు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.. ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

ఉస్తాద్ హీరో రామ్ పోతినేని(Ram pothineni) డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్(Puri jagannadh) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్(Double ismart). ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. అయితే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎవరు చేయనున్నారు అనేది మేకర్స్ రివీల్ చేయలేదు. 

ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ లో మణిశర్మ మ్యూజిక్ కీ రోల్ పోషించింది. అయితే ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ పాన్ ఇండియా లెవల్లో రానుంది కాబట్టి ఆ రేంజ్ కు తగ్గట్టుగా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకుంటారు అనే వార్తలు వినిపంచాయి. తాజా సమాచారం ప్రకారం డబుల్ ఇస్మార్ట్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. అతను మరెవరో కాదు మణిశర్మనే. అవును ఈ సినిమా కోసం కూడా మళ్ళీ మణిశర్మనే తీసుకున్నారట మేకర్స్.

Also Read :- సంక్రాంతి బ‌రిలో ర‌జినీ సినిమా.. నేపథ్యం ఏంటంటే..?

ఇది సీక్వెల్ కాబట్టి ఓల్డ్ మ్యూజిక్ ను రిపీట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. ఆ మ్యాజిక్ రిపీట్ కావాలంటే మణిశర్మ అయితేనే బాగుంటుందని భావిస్తున్నారట మేకర్స్. అంతేకాదు.. ఈ సినిమాకు సమందించిన మొదటి సాంగ్ రికార్డింగ్ కూడా కంప్లీట్ చేశారట మణిశర్మ. రామ్, పూరి, మని.. ఈ ముగ్గురి కాంబోలో వస్తున్న రెండో మూవీ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతూందో చూడాలి మరి.