గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. దాదాపు రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. కారణం ఈ సినిమాకు దర్శకుడు శంకర్ అవడమే. సాధారణంగా శంకర్ సినిమాలంటే భారీగా ఉండటమే కాకుండా.. షూటింగ్ కి కూడా చాలా సమయం పడుతుంది. ఆయన ఏ విషయంలో కాంప్రమైజ్ అవడు. అందుకే ఆయన సినిమాల రిలీజ్ లేట్ అవుతుంది. ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ విషయంలో కూడా అదే జరిగింది.
గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటి వరకు..ఒకటి రెండు పోస్టర్స్, టైటిల్‌తో పాటు ఒక సాంగ్ మాత్రమే రిలీజ్ చేశారు. దీంతో..గతంలోనే గేమ్ ఛేంజర్ అప్డేట్స్ కావాలని నెగిటివ్ ట్రెండ్ చేశారు ఫ్యాన్స్. కానీ ఈ సారి మాత్రం మేకర్స్‌కు గట్టిగానే ఇచ్చుకున్నారు.
అయితే ఆగష్టు నెల ఆఖరులో గేమ్ చేంజర్ సెకండ్ సింగిల్ రిలీజ్ ఉంటుందని గతంలో తమన్ చెప్పారు. కానీ,ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో మెగా ఫ్యాన్స్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ని, శంకర్, దిల్ రాజ్ లను ట్విట్టర్ లో ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు.దీంతో.. మెగా ఫ్యాన్స్ కాస్త శాంతించండని..మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇండైరెక్ట్‌గా తాజాగా ఒక పోస్ట్ పెట్టాడు.
Also Read :- రాజమౌళి బర్త్డే స్పెషల్.. మూవీ కీలక అప్డేట్!
‘గేమ్ ఛేంజర్..హ్యాపీ వినాయక చవితి 2024’ అంటూ ట్వీట్ చేశాడు తమన్. దీనికి సై అన్నట్టు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఒక ఎమోజీతో రిప్లై ఇచ్చింది. అంటే.. సెప్టెంబర్ 7న వినాయక చవితి సందర్భంగా.. గేమ్ ఛేంజర్ నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతుందని కన్ఫామ్ అయిందన్నమాట.
G-A-M-E-C-H-A-N-G-E-R 💪🏾
— thaman S (@MusicThaman) September 6, 2024
🔥🧨#HappyVinayakChavithi 2024 🧿✨
మరి వచ్చేది టీజరా? లేక సాంగ్ హా ? లేదంటే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారా? అని సందేహంలో ఫ్యాన్స్ ఉన్నారు. తాజా అందుతున్న సమాచారం ప్రకారం..మేగ్జిమమ్ సెకండ్ సింగిల్ కి రిలీజ్ చేయొచ్చని భావిస్తున్నారు. హీరో ఎలివేషన్ తో నడిచే సాంగ్ గా ఈ సెకండ్ సింగిల్ ఉండొచ్చని థమన్ పెట్టిన ఎమోజీల బట్టి అంచనా వేస్తున్నారు. అయితే అది ఎంత వరకు వాస్తవం అవుతుందనేది తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.
రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటే ఎలా ఉంటుందో ట్విట్టర్ ఓపెన్ చేస్తే అర్ధమైపోతుంది. ఒక అప్డేట్ కోసం ఎంత నిరీక్షిస్తున్నారో తెలిసిపోతుంది. అందుకే మేకర్స్ పై కోప్పడుతున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే మాటల్లో చెప్పలేని, రాతల్లో రాయలేని విధంగా తిడుతూ ట్విట్టర్ లో మేకర్స్ కి ట్యాగ్ చేస్తున్నారు. ఇక తాజా తమన్ ట్వీట్ తో కాస్త రిలాక్స్ అవుతూ..ఇవ్వండి సార్..ఎదురుచూడలేం అంటున్నారు. మరి రేపు ఎలాంటి అప్డేట్ రానుందో చూడాలి.
నిజానికి ఈ సినిమా షూటింగ్ రెండేళ్లుగా సాగుతూ వస్తోంది. ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా కావడం, అది కూడా శంకర్ దర్శకుడు అవడంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. ముందు ఈ సినిమా షూటింగ్ సజావుగానే సాగింది. మధ్యలో కమల్ హాసన్ ఇండియన్ 2 రావడంతో రెండు సినిమాలను ఒకేసారి కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది శంకర్ కి. అందుకే గేమ్ ఛేంజర్ విడుదల ఆలస్య అయ్యింది. దాంతో రామ్ చరణ్ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ కళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది.