యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త స్టైలిష్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ షేర్ చేసిన బ్లాక్ అండ్ వైట్ పిక్ అభిమానులను ఆకట్టుకుంది. ఆ ఫొటోలో ఎన్టీఆర్ గుబురు గడ్డం, వెట్ హెయిర్, నోట్లో టూత్‌పిక్ లుక్‌తో తారక్ మాస్ అవతార్‌లో కనిపిస్తున్నారు. తమ అభిమాన స్టార్ నుంచి ఏ మాత్రం ఊహించని లుక్ రివీల్ అవ్వడంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
అయితే, ఈ లుక్ ప్రశాంత్ నీల్ సినిమాకోసమా? లేదా మరి ఇంకేదైనా ప్రాజెక్ట్ హా? అని తెగ చర్చిస్తున్నారు. ఈ ఫొటోకు థమన్ నుంచి ఎలాంటి హింట్ రాకపోవడం సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. అయితే, ఫోటోతో పాటు థమన్ పెట్టిన ‘బ్లాస్ట్’ ఎమోజీలు మాత్రం భారీ అప్డేట్‌కు హింట్ అని మాత్రం అభిమానులు ఫిక్స్ అయిపోయారు.
ఈ క్రమంలోనే తాజా స్టైలిష్ మేకోవర్.. దర్శకుడు త్రివిక్రమ్ తో చేయబోయే God of War ప్రాజెక్ట్ కోసం అయ్యుంటుందని అంటున్నారు. మరోవైపు, ఈ ఫోటో AI ద్వారా క్రియేట్ అయిందేమో అన్న సందేహాలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ లుక్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక క్లారిటీ రాకపోవడం గమనార్హం!
Music Director @MusicThaman insta story#NTR #NTRNeel pic.twitter.com/vsTIwHsUDu
— Milagro Movies (@MilagroMovies) May 8, 2026
ఇకపోతే, తారక్-థమన్ మధ్య మంచి బాండింగ్ ఉందని తాజా ఫోటో చెబుతుంది. వీరి కాంబోలో వచ్చిన బాద్ షా, రామయ్య వస్తావయ్యా, అరవింద సమేత వీర రాఘవ వంటి సినిమాలు మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. తారక్ డెడికేషన్, వ్యక్తిత్వంపై థమన్ పలు సందర్భాల్లో ప్రశంసలు కురిపిస్తూ వస్తున్నారు.
ఎన్టీఆర్ బర్త్ డే ట్రీట్:
ఎన్టీఆర్ బర్త్‌డే (మే 20)కు ఒకటి, రెండు కాదు.. ఏకంగా నాలుగు అప్‌డేట్స్ వస్తాయనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న ‘డ్రాగన్’ నుంచి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారట. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్టు టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోపాటు ఆ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి గాడ్ ఆఫ్ వార్, షణ్ముఖుడు అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. సితార ఎంటర్‌టైన్స్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
ALSO READ :దుమ్మురేపుతున్న ‘పెద్ది’ బుకింగ్స్..
మరోవైపు తమిళ డైరెక్టర్ వెట్రిమారన్, ఎన్టీఆర్ కాంబోను కూడా అఫీషియల్‌గా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. వీరి కాంబినేషన్ గురించి గత కొన్నిరోజులుగా గాసిప్స్ వినిపిస్తుండగా దీనిపై క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర2’ గురించి కూడా క్లారిటీ వచ్చే చాన్స్ ఉందని తెలుస్తోంది. మొత్తానికి ఇలా నాలుగు అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఎన్టీఆర్ ఏమేర ట్రీట్ ఇవ్వనున్నాడో తెలియాలంటే బర్త్‌డే వరకు వేచి చూడాల్సిందే.
“ HIS REIGN…… HIS SOIL “
— #NTRNeel (@NTRNeelFilm) April 21, 2026
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥#NTRNeel https://t.co/ylSX0GglYM
