వరుడి కాళ్లు కడిగి కన్యాదానం చేసిన ముస్లీం దంపతులు

V6 Velugu Posted on Oct 25, 2021

కామారెడ్డి జిల్లా బాన్సువాడలోలో దత్తత తీసుకున్న యువతికి హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు ముస్లిం దంపతులు. స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఇర్ఫానా బాను, పదేళ్ల కిందట తాడ్వాయి గురుకులంలో  పనిచేశారు. ఆసమయంలో తల్లిదండ్రులు కోల్పోయిన చందన అనే బాలికను ఆమె బంధువులు గురుకులంలో చేర్పించారు. అమ్మాయికి తల్లిదండ్రులు లేరని తెలుసుకున్న ఇర్ఫానాబాను  చందనను దత్తత తీసుకున్నారు. అప్పటికే ఇర్ఫానాకు ఇద్దరు కూతుళ్లున్నారు. ప్రస్తుతం చందన ల్యాబ్ టెక్నిషియన్ కోర్సు పూర్తి చేసింది. నస్రుల్లాబాద్ మండలంలోని బొమ్మనదేవిపల్లికి చెందిన వెంకటరెడ్డితో చందనకు వివాహం జరిపించారు. ఇర్ఫానా బాను, ఆమెభర్త షేక్ అహ్మద్ కలిసి వరుడి కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. 

 

Tagged Muslim couple, wedding, Adopted daughter, kamareddy, Hindu Tradition

Latest Videos

Subscribe Now

More News