
నెట్వర్క్, వెలుగు : వక్ఫ్ సవరణ బిల్లు2025 సవరణకు వ్యతిరేకంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలుచోట్ల శుక్రవారం ముస్లిం నిరసన ర్యాలీ నిర్వహించారు. మానవహారం చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించిప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధ వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌చేశారు.
భద్రాచలంలో ర్యాలీకి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌చైర్మన్ పొదెం వీరయ్య, సీపీఎం, బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. ఆర్డీవో ఆఫీసు వరకు వెళ్లి ఆర్డీవో దామోదర్‌కు వినతిపత్రం అందజేశారు.