
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గురువారం రంజాన్ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. 30 రోజుల పాటు చేపట్టిన ఉపవాసాలను విరమించి ఒకరికొకరు ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక నమాజ్, ప్రార్థనలు చేశారు. పలువురు రాజకీయ నాయకులు ఈద్గాలు, మసీదుల వద్దకు వెళ్లి ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ఈద్గాల వద్ద ముస్లింలకు రంజాన్ విషెస్ చెప్పారు. నర్సాపూర్, హత్నూర, దౌల్తాబాద్ లోని ఈద్గాల వద్ద ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని వ్యాపార కేంద్రాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి.