ముత్యాలమ్మ గుడి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తం: మంత్రి పొన్నం ప్రభాకర్

ముత్యాలమ్మ గుడి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తం: మంత్రి పొన్నం ప్రభాకర్
  • ముత్యాలమ్మ గుడి పునర్నిర్మాణానికి నిధులు అందజేస్తామని ప్రకటించిన మంత్రి, ఎమ్మెల్యే

సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ ​ముత్యాలమ్మ గుడిలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడిని కఠిన శిక్ష పడేలా చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్​తో కలిసి ముత్యాలమ్మ ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఆదివారం కలిశారు. ముత్యాలమ్మ గుడి ఘటనను ప్రభుత్వం సీరియస్​గా తీసుకుందని మంత్రి తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

కంటోన్మెంట్ఎమ్మెల్యే శ్రీగణేశ్​ మాట్లాడుతూ.. గుడి పునర్నిర్మాణానికి తన సొంత నిధుల నుంచి రూ.10 లక్షలు అందజేస్తానని చెప్పారు. అలాగే మంత్రి తన నిధుల నుంచి మరో రూ.10 లక్షలు దేవాలయ పునర్నిర్మాణానికి అందజేస్తామని హామీ ఇచ్చారన్నారు. కమిటీ సభ్యులు సంతోష్, కిరణ్, సాయి ప్రకాశ్, కిషన్, ఎల్లిస్, వైష్ణవి, సోను ఉన్నారు.