మై హోమ్ కంస్ట్రక్షన్స్ లో మెగా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ 'మై హోమ్ సయుక్' ఇవాళ ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్ ను టాలివుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మై హోం రామేశ్వరరావుతో కలిసి లాంచ్ చేశారు. మై హోమ్ సంస్థ గోనెపల్లి నుండి తెల్లాపూర్ వెళ్లే రోడ్ లో ఈ కొత్త వెంచర్ ప్రారంభించింది. తెల్లాపూర్ టెక్ నో సిటీ కి అతి సమీపంలో మై హోమ్ గ్రూప్,ప్రతిమ గ్రూప్ జాయింట్ వెంచర్ గా ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ ను ప్రారంభించారు. మొత్తం ప్రాజెక్ట్ 25.37 ఎకరాల్లో డిజైన్ చేశారు.మై హోమ్ సంయుక్ వెంచర్ లో 12 టవర్స్ ను ప్రీమియం ఏమినిటీస్ తో 2బీహెచ్ కే , 2.5 బీహెచ్ కే , 3బీహెచ్ కే లను 1355 ఎస్ ఎఫ్ టి నుండి 2262 ఎస్ ఎఫ్ టిలో నిర్మిస్తున్నారు.