చట్టం దృష్టిలో ప్రధాని కూడా సమానమే 

చట్టం దృష్టిలో ప్రధాని కూడా సమానమే 

లక్నో: చట్టం దృష్టిలో అందరూ సమానమేనని ప్రధాని మోడీ అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ మొదలైనప్పుడు టీకా కోసం తాను, తన తల్లి ఎగబడలేదన్నారు. అదే ఒకవేళ కుటుంబ పార్టీలేతే.. సాధారణ ప్రజల కంటే ముందే వ్యాక్సిన్ కోసం ఎగబడేవారని కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీని ఉద్దేశించి మోడీ వ్యాఖ్యానించారు. ‘నేను, మా అమ్మ వ్యాక్సిన్ తీసుకున్నాం. ఆమెకు వందేళ్లు ఉన్నప్పటికీ టీకా కోసం ఎగ‌బ‌డ‌లేదు. ఆమె వంతు వ‌చ్చిన‌ప్పుడే వ్యాక్సిన్ వేసుకున్నారు. ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. బూస్టర్ డోసు కూడా తీసుకోలేదు. అదే ఒకవేళ కుటుంబ పార్టీ నేతలైతే.. రూల్స్ ను తుంగ‌లో తొక్కి వ్యాక్సిన్ కోసం ముందు వ‌రుస‌లో ఉండేవార‌ు’ అని మోడీ విమర్శించారు. ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ పైకామెంట్స్ చేశారు. తమ ప్రభుత్వం ప్రజలకు కొవిడ్ టీకాను ఉచితంగా ఇచ్చింద‌న్నారు. కాంగ్రెస్ అయితే వ్యాక్సిన్‌ను అమ్ముకునేద‌ని పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం: 

త్వరలోనే భారత విద్యార్థులను సేఫ్గా తీసుకొస్తం

త‌మిళ బిగ్ బాస్ హోస్ట్ గా శింబు

వార్ ఎఫెక్ట్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు