త‌మిళ బిగ్ బాస్ హోస్ట్ గా సినీ నటుడు శింబు

త‌మిళ బిగ్ బాస్ హోస్ట్ గా సినీ నటుడు శింబు

ప‌లు భాష‌ల్లో ప్ర‌సార‌మ‌వుతూ  ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంటోంది బిగ్ బాస్ . త‌మిళ బిగ్ బాస్ షోకి విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ హోస్ట్ నుండి త‌ప్పుకున్నారు.  ఆయన స్థానంలో త‌మిళ స్టార్ నటుడు శింబు హోస్ట్ చేయ‌నున్నాడు. దీనికి సంబంధించి ప్రోమో  విడుద‌ల చేశారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తమిళ్ ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని షేర్ చేసింది. ఇక పై  శింబు తమిళ్ బిగ్‏బాస్ షో హోస్ట్‏గా వ్యవహరించనున్నట్లు ఆ వీడియో ద్వారా స్పష్టం చేశారు నిర్వాహకులు.

కరోనా కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగ్స్ అన్ని ఇప్పుడు పూర్తిగా ఓపెన్ కావడంతో.. అటు సినిమా షూటింగ్స్ కు .. ఇటు బిగ్ బాస్ షోకు వ్యాఖ్యతగా వ్యవహరించడం వీలు కాకపోవడంతో షో నుంచి తప్పుకుంటున్నట్లుగా కమల్ ప్రకటించారు.ఇక ఇప్పుడు కమల్ స్థానంలో నటుడు శింబు ప్రేక్షకులను అలరించనున్నాడు.

మరిన్ని వార్తల కోసం..

ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు