నా ఫోన్ ట్యాప్ చేస్తే ఎలా మాట్లాడాలి : దీదీ

నా ఫోన్ ట్యాప్ చేస్తే ఎలా మాట్లాడాలి : దీదీ

నా ఫోన్ ట్యాప్ చేస్తే ఎలా మాట్లాడాలంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసహనం వ్యక్తం చేశారు. తన ఫోన్ ను ఎవరో ట్యాప్ చేస్తున్నారని, అగంతకుల నుంచి వాట్సాప్ మెసేజ్ లు వస్తున్నాయని దీదీ అన్నారు. ఇలా ఫోన్ ట్యాప్ చేస్తే ఎలా మాట్లాడాలని ప్రశ్నించారు. ఫోన్ లో స్వేశ్చగా మాట్లాడే అవకాశం లేకపోతే మనకు స్వాతంత్ర్యం వచ్చిందా లేదా అన్న అనుమానం కలుగుతుందున్నారు. ఫోన్ ట్యాపింగ్ పై ప్రధాని మోడీ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇప్పటికే కేంద్రం అనేక సార్లు తన ఫోన్ ట్యాప్ చేసినట్లు, ఆ విషయం కేంద్రానికి కూడా తెలుసని చెప్పుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు కేంద్రంతో పాటు మరో రెండు, మూడు రాష్ట్రాలు కుట్రపన్నాయని, ఒక రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉందని మమతా బెనర్జీ ఆరోపించారు.