అంగ్‌ సాన్‌ సూకీకి మరో నాలుగేళ్ల జైలు

అంగ్‌ సాన్‌ సూకీకి మరో నాలుగేళ్ల జైలు

మయన్మార్‌ పదవీచ్యుత నేత,76 ఏళ్ల నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అంగ్‌సాన్‌ సూకీపై నమోదైన క్రిమినల్‌ అభియోగాలపై జుంటా కోర్టు విచారణ చేపట్టింది. సూకీని ఈ కేసుల్లో దోషిగా తేల్చిన జుంటా కోర్టు.. మరో నాలుగేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. గతేడాది ఫిబ్రవరి 1న సూకీ ప్రభుత్వాన్ని కూలదోసిన.. జుంటా సైన్యం అధికారాన్ని చేపట్టింది. వాకీ-టాకీలను అక్రమంగా దిగుమతి చేయడం, వినియోగించడం వాటిపై రెండేళ్లు, కరోనా నిబంధనలను ఉల్లంఘించారన్న అభియోగాలపై మరో రెండేళ్లు జైలు శిక్ష విధించినట్లు... సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ శిక్షలను, తీర్పులను జుంటా అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ జా మిన్‌ తున్‌ కన్ఫాం  చేశారు. ఆమెపై నమోదైన ఇతర కేసుల విచారణ జరుగుతాయని తెలిపారు.  అయితే.. ఇప్పటికే పలు కేసుల్లో ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్షను జుంటా కోర్టు. విధించింది. 

 

మరిన్ని వార్తల కోసం..

జైలులో ఉన్న 46 మంది ఖైదీలకు కరోనా