జైలులో ఉన్న 46 మంది ఖైదీలకు కరోనా

జైలులో ఉన్న 46 మంది ఖైదీలకు కరోనా

కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో... దేశరాజధాని ఢిల్లీలో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. తాజాగా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ కమిషనర్ సహా 300 మంది పోలీసులు కరోనా బారినపడ్డారు. ఢిల్లీలో 80 వేలకు పైగా పోలీస్ సిబ్బంది ఉన్నారు. పోలీస్ డిపార్ట్‎మెంట్‎లో కరోనా కేసులు నమోదు కావడంతో.. ఢిల్లీ పోలీసు కమిషనర్ రాకేష్ అస్థానా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్ జారీ చేశారు. 

ఢిల్లీ కమిషనర్ ఆదేశాల ప్రకారం.. పోలీసు సిబ్బంది ప్రజల మధ్య తమ విధులను నిర్వర్తించే ఫ్రంట్‌లైన్ కార్మికులు కాబట్టి, కోవిడ్‌కు గురికాకుండా తమను తాము రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని పేర్కొంది. అదేవిధంగా పోలీసు సిబ్బంది అందరూ ఫేస్ మాస్క్‌లు ధరించి.. సామాజిక దూరాన్ని పాటించాలని తెలిపింది. పోలీసులు తమతమ విధులను నిర్వర్తిస్తున్నప్పుడు సరైన పరిశుభ్రతను పాటించాలని సూచించింది.

46 మంది ఖైదీలు, 43 మంది సిబ్బందికి పాజిటివ్‌

ఢిల్లీలోని మూడు జైళ్లలో 46 మంది ఖైదీలు మరియు 43 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‎గా తేలినట్లు అధికారులు తెలిపారు. కరోనా సోకిన ఖైదీలు, సిబ్బంది ఐసోలేషన్‌లో ఉన్నారని.. వారు ప్రస్తుతం కోలుకుంటున్నారని సీనియర్ అధికారి తెలిపారు.

జైలు అధికారుల సమాచారం ప్రకారం..  ఆదివారం వరకు 46 మంది ఖైదీలకు కరోనా సోకింది. తీహార్‌ జైలులో 29 మంది ఖైదీలకు, మండోలి జైలులో ఉన్న 17 మంది ఖైదీలకు కరోనా సోకింది. కరోనా సోకిన 43 మంది సిబ్బందిలో 25 మంది తీహార్‌ జైలుకు, 12 మంది రోహిణి జైలుకు, ఆరుగురు మండోలి జైలుకు చెందినవారున్నారు.

కాగా.. జైలు కాంప్లెక్స్‌లలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జైలు డిస్పెన్సరీలను కరోనా కేర్ సెంటర్లుగా మార్చారు. త్వరలో తీహార్‌ జైలులో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుచేయనున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా స్వల్ప లక్షణాలున్న ఖైదీల కోసం మెడికల్ ఐసోలేషన్ సెల్‌లను ఏర్పాటు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. పాజిటివ్‌గా వచ్చి లక్షణాలు లేని వారిని అదే జైలులో ప్రత్యేక ఐసోలేషన్ సెల్‌లలో ఉంచుతున్నారు. ఖైదీల భద్రత దృష్ట్యా తీహార్‌లోని 120 పడకల ఆస్పత్రి మరియు మండోలిలోని 48 పడకల ఆస్పత్రిని కరోనా ఆరోగ్య కేంద్రాలుగా మార్చారు.

For More News..

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అరెస్ట్

దేశంలో 4 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు

ప్లేట్​ దోసె 2, ఇడ్లీ 3, ఊతప్పం 4 రూపాయలు