- హరీశ్ రావు, కేటీఆర్ పై మైనంపల్లి ఫైర్
మెదక్, వెలుగు: బావాబామ్మర్దులు అక్రమంగా ఇసుక అమ్ముకుని వేలకోట్లు దోచుకున్నారని కాంగ్రెస్రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుఆరోపించారు. మెదక్ పట్టణానికి చెందిన మెదక్ సొసైటీ మాజీ చైర్మన్, మాజీ కౌన్సిలర్చింతల నర్సింలు, మున్సిపల్ మాజీ వైస్చైర్మన్ఉప్పల కిష్టయ్య, మాజీ కౌన్సిలర్ మాడిశెట్టి అంజయ్య తమ అనుచరులతో ఆదివారం కాంగ్రెస్‌పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మాయా గార్డెన్నుంచి వెంకటేశ్వర గార్డెన్ వరకు బైక్‌ర్యాలీ నిర్వహించారు. అనంతరం మైనంపల్లి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న హరీశ్రావుహవేలీ ఘనపూర్ మండలం సర్ధన వద్ద మంజీరా నది నుంచి, కొల్చారం మండలం కొంగోడ్ వద్ద హల్దీ వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలించి అమ్ముకున్నారని ఆరోపించారు. ఆయన బావ మరిది కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో నుంచి పెద్ద మొత్తంలో ఇసుక తరలించి అమ్ముకున్నారని ధ్వజమెత్తారు.
హరీశ్ మెదక్ వచ్చి ఎంతో అభివృద్ధి చేశామని చెప్పడాన్ని హన్మంతరావు తీవ్రంగా ఖండించారు. మెదక్‌నుంచి అనేక ప్రభుత్వ కార్యాలయాలను సిద్దిపేట తరలించారని, వాటన్నింటిని మళ్లీ మెదక్ తీసుకొస్తేనే ఆయనకు గౌరవిస్తామని లేదంటే అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. హరీశ్ రావువెంట ఉన్న ఒకాయన సొసైటీని దోచుకున్నారని పరోక్షంగా మాజీ ఎమ్మెల్యే పద్మా రెడ్డి భర్త దేవేందర్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో సీనియర్లకు పోటీ చేసే అవకాశం దొరక్క పోతే వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ఆంజనేయులు గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పరుశరాంగౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రపాల్, టౌన్‌పార్టీ ప్రెసిడెంట్గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్హఫీజొద్దీన్, నాయకులు బాలకృష్ణ, మధుసూదన్ రావు, అశోక్, వెంకటరమణ, పవన్, రాజేశ్ పాల్గొన్నారు.
