
హిందీ చిత్రం ‘థామా’తో మంగళవారం ప్రేక్షకులను పలకరించింది రష్మిక. ఈ రొమాంటిక్ హారర్ కామెడీ మూవీలో తన నటనకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే తను లీడ్ రోల్‌లో నటిస్తున్న ‘మైసా’ సినిమాకు సంబంధించి దీపావళి సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. త్వరలో గ్లింప్స్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇక ఈ పోస్టర్‌లో రష్మిక చేతితో తుపాకి పట్టుకోగా, మరోవైపు తన చేతికి సంకెళ్లు వేసి ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
గోండు తెగల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మునుపెన్నడూ కనిపించని ఇంటెన్స్ అవతార్‌లో రష్మిక నటిస్తోందని మేకర్స్ చెప్పారు. ఈ ఫిమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు రవీంద్ర పుల్లె దర్శకుడు. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.