మోదీ రూ.80 లక్షల హోటల్ బిల్లు ఎగ్గొట్టిన అధికారులు.. నోటీసులు ఇచ్చిన ఓనర్

మోదీ రూ.80 లక్షల హోటల్ బిల్లు ఎగ్గొట్టిన అధికారులు.. నోటీసులు ఇచ్చిన ఓనర్

ఏడాది క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ ప్రొగ్రామ్ కు మైసూర్ వచ్చి ఓ హోటల్ లో బస చేశారు. అయితే ఆ హోటల్ బిల్ ఇంకా కట్టలేదట. బిల్ అంటే అంతా ఇంతా కాదండోయ్.. ఫైవ్ స్టార్ హోటర్ కాబట్టి రూ.లక్షల్లో ఉంటుంది. కట్టకుంటే వాళ్లు ఊకుంటారా మరి.. 2024 జూన్ 1లోగా బిల్ కట్టకుంటే లీగల్ గా వెళ్తామని అధికారులకు నోటీసుల పంపారు. 

2023 ఏప్రిల్ 9 నుంచి 11 వరకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నిర్వహించిన 50 ఏళ్ల ప్రాజెక్ట్ టైగర్ ఈవెంట్‌ను ప్రారంభించేందుకు మోదీ మైసూర్ వచ్చారు. ఆర్గనైజింగ్ అధికారులు రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లో మోదీ ఉండటానికి ఏర్పాటు చేశారు. 

ఆ హాటల్ బిల్ రూ.80 లక్షలైంది. అది ఇప్పటి వరకూ చెల్లించలేదు. ఈ విషయం డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బసవరాజుకు లెటర్ రాసి చాలా సార్లు గుర్తుచేశారు. అయినా ఏం లాభం లేదు. ఆ ప్రొగ్రామ్ ఎస్టిమేషన్ ఖర్చు రూ.3కోట్లు అయితే అది మొత్తం కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించారు. కానీ ఖర్చు అనుకున్నాదానికంటే డబుల్ అయింది. కేంద్రం రూ.3కోట్లు ఇచ్చింది కానీ, అదనంగా అయిన మరో రూ.3.3కోట్లు ఇప్పటి వరకు విడుదల కాలే.. దీంతో ఆ హోటల్ బిల్ కట్టలే.. మే 21న హోటల్ యాజమాన్యం బిల్ కట్టాలని, లేకుంటే కోర్టుకు వెళ్తామని అధికారులకు లేఖ రాసింది.