Thriller Movie: మైథికల్ బ్యాక్డ్రాప్లో తెలుగు థ్రిల్లర్‌.. ‘త్రికాల’ రిలీజ్ డేట్ అనౌన్స్

Thriller Movie: మైథికల్ బ్యాక్డ్రాప్లో తెలుగు థ్రిల్లర్‌.. ‘త్రికాల’ రిలీజ్ డేట్ అనౌన్స్

సనాతన ధర్మంలోని ఆధ్యాత్మిక రహస్యాలను ఆధారంగా చేసుకుని రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’.  శ్రద్ధాదాస్ లీడ్ రోల్‌‌‌‌లో నటించిన ఈ చిత్రంలో మాస్టర్ మహేంద్రన్, అజయ్, ఆమని కీలక పాత్రలు పోషించారు. మణి తెల్లగూటి దర్శకత్వంలో  రాధిక, శ్రీనివాస్ నిర్మించారు.  చాగంటి ప్రొడక్షన్ ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌పీ ద్వారా  మే 29న సినిమా విడుదల చేయనున్నట్టు  ప్రకటించారు.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌‌‌‌, పాటలు, ప్రమోషనల్ కంటెంట్  సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ సందర్భంగా  దర్శకుడు మణి తెల్లగూటి మాట్లాడుతూ ‘చీకటిలో వెలుగుగా మారే ఓ శక్తి చుట్టూ ‘త్రికాల’ కథ సాగుతుంది. సనాతన ధర్మంలోని కొన్ని రహస్యాలను థ్రిల్లింగ్‌‌‌‌గా చూపించే ప్రయత్నం చేశాం.

ప్రేక్షకులకు ఇది కొత్త అనుభూతిని ఇస్తుంది’ అని చెప్పాడు.  ఈ చిత్రానికి  హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించడం మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇప్పటికే ఈ సినిమాకు నార్త్ ఇండియాలో కూడా మంచి బిజినెస్ జరిగినట్లు చిత్రబృందం వెల్లడించింది.