హైదరాబాద్, వెలుగు: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్సార్) కార్యక్రమంలో భాగంగా ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఎన్జెన్ హైదరాబాద్‌లోని సేవా భారతి ఆసుపత్రికి సర్జీకల్ పరికరాలను అందజేసింది. ఎన్జెన్ గ్లోబల్ సర్వ్ ద్వారా ఆర్థోపెడిక్, లాపరోస్కోపిక్ ఆపరేషన్లకు అవసరమైన ఈ పరికరాలను విరాళంగా ఇచ్చింది. సీతారాంబాగ్‌లోని డాక్టర్ ఈశ్వర్ చంద్ర చారిటబుల్ హాస్పిటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ పరికరాలను అందజేశారు. అల్పాదాయ వర్గాలకు, వైద్య బీమా లేని కుటుంబాలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయని ఎన్జెన్ తెలిపింది.
