అంబేద్కర్ ఓపెన్ వర్సిటీకి న్యాక్ ఏ గ్రేడ్

అంబేద్కర్ ఓపెన్ వర్సిటీకి న్యాక్ ఏ గ్రేడ్

హైదరాబాద్, వెలుగు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి న్యాక్ ఏ గ్రేడ్ గుర్తింపు లభించింది. గత ఏడాది జులైలో న్యాక్ బృందం వర్సిటీలో పర్యటించింది. అయితే, అన్ని విభాగాలను పర్యవేక్షించి 2.96 పాయింట్లతో బీ ప్లస్ ప్లస్ గ్రేడ్ఇచ్చింది. తమకు రావాల్సిన స్థాయిలో పాయింట్లు రాలేదనిఅసెస్ మెంట్ చేయాలని వర్సిటీ రిజిస్ట్రార్ ఏవిఎన్ రెడ్డి న్యాక్ కు మళ్లీ దరఖాస్తు చేశారు. 

ఈ నేపథ్యంలో ఆరుగురు సభ్యుల బృందంతో కూడిన న్యాక్ కమిటీ మార్చి 21, 23 వరకు మళ్లీ అసెస్ మెంట్ చేసింది. కమిటీ ఇచ్చిన రిపోర్టుతో న్యాక్ పాలక వర్గం శనివారం బెంగళూరులో సమావేశమైంది. వర్సిటీకి 4 పాయింట్ల ఫార్ములాలో 3.12 స్కోర్ తో ఏ గ్రేడ్ కేటాయించింది. కాగా, యూనివర్సిటీకి ఏ గ్రేడ్ రావడానికి కష్టపడ్డ ఉద్యోగులకు వైస్ ఛాన్సలర్ సీతారామారావు అభినందనలు తెలిపారు.