ప్రకృతిపై ప్రేమతో.. నభా నటేష్ ఎమోషనల్ పోస్ట్

ప్రకృతిపై ప్రేమతో.. నభా నటేష్ ఎమోషనల్ పోస్ట్

ఓ వైపు హీరోయిన్‌‌‌‌గా బిజీగా ఉంటూనే, మరోవైపు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌‌‌‌గా ఉంటుంది నభా నటేష్.  డిఫరెంట్ ఫోటోషూట్స్‌‌‌‌ షేర్ చేసే ఆమె.. తాజాగా ప్రకృతిపై  తనకున్న ప్రేమను చాటుకుంది. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నభా నటేష్.. ఓ  చెట్టును కౌగిలించుకున్న ఫొటోను ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌లో  షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ‘ఈ రోజు ఒక చెట్టును కౌగిలించుకున్నాను..  ఆ చెట్టు కూడా నన్ను తిరిగి కౌగిలించుకుందనే భావన కలిగింది. 

ఎంతో అందమైన ఈ ప్రపంచాన్ని చూసేందుకు వచ్చిన అతిథులం మనం. ఇక్కడ ప్రకృతి మనకెన్నో గొప్ప అనుభవాలు ఇస్తోంది. ఈ ప్రకృతిని, పర్యావరణాన్ని అనుభూతి చెందడం మాత్రమే మనకున్న హక్కు. ఈ సంతోషాలు ఇచ్చిన నేచర్‌‌‌‌‌‌‌‌కి రుణపడి ఉంటాను’ అని ఆమె చేసిన ఈ పోస్ట్‌‌‌‌ అందరి దృష్టిని ఆకర్షించింది.  

ప్రస్తుతం పలు ఇంటరెస్టింగ్‌‌‌‌ ప్రాజెక్టుల్లో  నటిస్తోంది నభా.  నిఖిల్ హీరోగా నటిస్తున్న ‘స్వయంభు’తో పాటు  ‘నాగబంధం’లో హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. వీటితోపాటు  మరికొన్ని క్రేజీ చిత్రాలు లైనప్‌‌‌‌లో ఉన్నాయి.