యూఎస్ మధ్యంతర ఎన్నికల్లో నబీలా సయ్యద్ గెలుపు

యూఎస్ మధ్యంతర ఎన్నికల్లో నబీలా సయ్యద్ గెలుపు

న్యూఢిల్లీ: అమెరికా మధ్యంతర ఎన్నిక ల్లో మన దేశ మూలాలున్న నబీలా సయ్యద్ విజయం సాధించారు. ఇరవై మూడేళ్ల నబీలా ఇల్లినాయిస్​ రాష్ట్ర జనరల్​ అసెంబ్లీకి ఎన్నికైన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పా రు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అయిన ఇండియన్ -అమెరికన్ ముస్లిం యువ తి నబీలా సయ్యద్.. ఇల్లినాయిస్ 51వ డిస్ట్రిక్ట్ నుంచి పోటీచేశారు. నవంబర్ 8న ఎన్నికలు జరిగాయి.

ఈ ఎన్నికల్లో ఆమె 52.3 శాతం ఓట్లు సాధించి.. రిపబ్లిక్ పార్టీకి చెందిన క్రిస్ బోస్​ను ఓడించారు.'అభ్యర్థిగా ప్రకటించినప్ప టి నుంచి ప్రజలతో మాట్లాడేందుకు ఎక్కువ టైం కేటాయించాను. అందువల్లే ఎలక్షన్ లో గెలిచాను. నా విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్'  అని  నబీలా ట్వీట్​ చేశారు.