
పారిస్: స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ ఎడమ తుంటి గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. అతను కోలుకునేందుకు ఐదు నెలల సమయం పట్టనుంది. దీంతో వింబుల్డన్, యూఎస్ ఓపెన్‌లో నాదల్ ఆడే చాన్స్ లేదు. శనివారం 37వ బర్త్ డే జరుపుకున్న స్పెయిన్ స్టార్.. ఫ్రెంచ్ ఓపెన్‌కు దూరంగా ఉండటం ఇదే తొలిసారి.
క్లే కోర్టుపై అతను రికార్డు స్థాయిలో 14 టైటిల్స్ నెగ్గాడు. జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్‌లో మెకంజీ మెక్‌డొనాల్డ్ చేతిలో ఓడిన తర్వాత తుంటి గాయంతో నడాల్ ఆటకు దూరమయ్యాడు.