![Naga chaitanya and sobhita: శ్రీశైల మల్లన్న ని దర్శించుకున్న అక్కినేని నాగ చైతన్య దంపతులు..](https://static.v6velugu.com/uploads/2024/12/naga-chaitanya-and-sobhita-dhulipalla-visits-the-srisailam-temple_WfZIRK36rB.jpg)
Naga chaitanya and sobhita: శ్రీశైల మల్లన్న ని దర్శించుకున్న అక్కినేని నాగ చైతన్య దంపతులు..టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైత్యన్య. ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ వివాహం డిసెంబర్ 4న ఘనంగా జరిగింది. కాగా వీరిపెళ్లికి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, నాని, అడివి శేష్ తదితర స్టార్ హీరోలతోపాటు కోలీవుడ్, బాలీవుడ్ నుచి కూడా సినీ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
పెళ్లయిన తర్వాత హీరో అక్కినేని నాగచైతన్య తన కుటుంభంతో కలసి శ్రీశైల మల్లికార్జున సన్నిధికి వెళ్లి దర్శించుకున్నాడు. ఇందులోభాగంగా నూతన వధూవరులు సాంప్రదాయ దుస్తులలో ప్రత్యేక పూజలు నిర్వహించి పండితుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం ఆలయాధికారులు నాగచైతన్యకి దేవుడి చిత్రపటాలతోపాటూ ప్రసాదాలు అందజేశారు.
Also Read:-టాలీవుడ్ లో పుష్ప 2 రికార్డుల ఊచకోత.. ఆ సినిమాల రికార్డులన్ని బ్రేక్..
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నాగ చైతన్య తెలుగులో తండేల్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఏఈ సినిమాకి తెలుగు ప్రముఖ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తుండగా మలయాళ బ్యూటిఫుల్ హీరోయిన్ సాయిపల్లవి హీరోయిన్ గా నటించింది. అయితే నాగచైతన్య సముద్ర జాలరి యువకుడి పాత్రలో నటించాడు. ఇటీవలే ఈ సినిమాలోయని ఫస్ట్ సింగిల్ బుజ్జితల్లి రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.