నాకు, కృతికి మధ్య ఇగో వార్‌‌‌‌‌‌‌‌

నాకు, కృతికి మధ్య ఇగో వార్‌‌‌‌‌‌‌‌

ఆరేళ్ల క్రితం సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్నినాయనా’ అంటూ వచ్చి సూపర్‌‌‌‌‌‌‌‌ సక్సెస్‌‌‌‌ అందుకున్నారు నాగార్జున. ఈ సంక్రాంతికి తండ్రితో కలిసి ‘బంగార్రాజు’గా వస్తున్నాడు నాగచైతన్య. 
ఈ నెల 14న సినిమా విడుదలవుతున్న సందర్భంగా చైతూ ఇలా ముచ్చటించాడు.  బంగార్రాజు పాత్ర అనగానే మొదట భయమేసింది. పైగా సీక్వెల్‌‌‌‌లో నటించడం నాకిదే ఫస్ట్ టైమ్. నాన్నను, డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ను చాలా డౌట్స్ అడిగాను. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాని మళ్లీ మళ్లీ చూసి నా క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ను ఓన్ చేసుకున్నాను. కొన్ని సీన్స్‌‌‌‌లో ఆ సీన్‌‌‌‌ పేపర్స్‌‌‌‌ నాన్నకిచ్చి ఆయనైతే ఆ డైలాగ్ ఎలాంటి మాడ్యులేషన్‌‌‌‌లో చెప్తారో ముందే రికార్డ్ చేసి ఇమ్మనేవాడిని. ఇలా ఒకటి రెండు నెలలు హోమ్ వర్క్ చేశాక మూవీ స్టార్ట్ చేశాం. 

బంగార్రాజు పాత్ర నాకు పెద్ద చాలెంజ్.  ప్రేక్షకుల్ని ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేసే క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ చేయడం అంత ఈజీ కాదు. పైగా సంక్రాంతి సినిమా అంటే మినిమమ్ ఎక్స్​పెక్టేషన్స్ ఉంటాయి. అందుకే నాకిది టఫెస్ట్ క్యారెక్టర్. నాన్నది గెస్ట్ రోల్‌‌‌‌ కాదు. ఆయన పాత్రే మెయిన్. ట్రైలర్‌‌‌‌‌‌‌‌లో నా సీన్స్‌‌‌‌ ఎక్కువున్నాయంతే. ఇద్దరి క్యారెక్టర్స్‌‌‌‌ ఈక్వల్‌‌‌‌. చిన్న బంగార్రాజు యాడ్‌‌‌‌ అవడం వల్ల కాన్‌‌‌‌ఫ్లిక్ట్ వస్తుంది. కథంతా నాన్న, రమ్యకృష్ణలిద్దరూ నడిపిస్తారు.  పెద్ద బంగార్రాజుకి మనవడి క్యారెక్టర్ నాది. అల్లరి చేస్తూ ఉంటాను. నన్ను కంట్రోల్‌‌‌‌లో పెట్టడానికి ఆయన కిందికి వస్తారు. మరోవైపు గుడికి సంబంధించిన కాన్‌‌‌‌ఫ్లిక్ట్ కూడా ఉంటుంది. బంగార్రాజు కొడుకు రాము పాత్ర అమెరికాలో ఉండటం వల్ల ఫోన్‌‌‌‌లో మాత్రమే కనిపిస్తారు.

 నాకు, కృతికి మధ్య ఇగో వార్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. సెకెండాఫ్‌‌‌‌లో అది హానెస్ట్ లవ్‌‌‌‌ స్టోరీగా మారుతుంది. నా సినిమాల్లో ఫస్ట్ సాంగ్‌‌‌‌కి మాత్రమే ఎక్కువ డ్యాన్స్ ఉంటుంది. నాన్నతో కలిసి ‘వాసి వాడి తస్సాదియ్య’ సాంగ్‌‌‌‌లో డ్యాన్స్ చేయడం మంచి మెమొరీ. దక్ష నగార్కర్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఓ సాంగ్ చేశా. సినిమాలో ఫస్ట్ సాంగ్. అది కూడా బాగా ఎంజాయ్ చేశాను.  ముప్ఫై అయిదు నిమిషాల పాటు వీఎఫ్‌‌‌‌ఎక్స్ వర్క్ ఉంటుంది. అవి కాక టెంపుల్‌‌‌‌ని సునామీ తాకే సీన్‌‌‌‌ని మినియేచర్స్‌‌‌‌తో తీశారు. వీఎఫ్‌‌‌‌ఎక్స్‌‌‌‌ వాడకుండా చాలా బాగా తీశారు డీవోపీ యువరాజ్‌‌‌‌. సినిమా అంతా కలర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌గా ఉంటుంది. పది నిముషాలకు ఓ హైలైట్‌‌‌‌ సీన్ ఉంటుంది. 

 ‘థాంక్యూ’ ఎనభై శాతం పూర్తయింది. జనవరి 25 తర్వాత ఫారిన్‌‌‌‌ షెడ్యూల్ ఉంది. త్రీ షేడ్స్ ఉండే క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌. అమెజాన్‌‌‌‌ ప్రైమ్‌‌‌‌ కోసం విక్రమ్‌‌‌‌ కుమార్ డైరెక్షన్‌‌‌‌లో ఓ హారర్ వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌ ప్లాన్ చేస్తున్నాం. నేను అలాంటివి చూడను కానీ కొత్తగా ఉంటుందని ట్రై చేస్తున్నా. నేను నటించిన సిరీస్‌‌‌‌ అయినా మ్యూట్‌‌‌‌లో పెట్టుకునే చూస్తాను (నవ్వుతూ). ‘లాల్ సింగ్‌‌‌‌ చద్ధా’  కంప్లీటయింది. ఏప్రిల్‌‌‌‌ 14 రిలీజ్.  ‘సర్కారు వారి పాట’ తర్వాత డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ పరశురామ్‌‌‌‌తో నా మూవీ ఉంటుంది. ‘నాంది’ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌తోనూ ట్రావెల్ అవుతున్నాను. స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ అవలేదు.