
ఇటీవల అక్కినేని నాగేశ్వర్రావుపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనిపై నాగచైతన్య, అఖల్ సైతం సోషల్ మీడియా వేధికగా స్పందించారు. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగిందనే వార్తలు బలంగా వినిపించాయి. తాజాగా జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ వివాదానికి నాగచైతన్య చెక్ పెట్టాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ వేడుకకు అతిథిగా హాజరైన ఈ అక్కినేని నాగ చైతన్య ఈ సంధర్బంగా ఎన్టీఆర్పై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశాడు. ఆయనతో స్నేహాన్ని తన తాతగారు చెప్తుంటే ఎంతో స్ఫూర్తి పొందేవాడినని తెలిపాడు. తనకు షేక్ హ్యాండ్ ఇచ్చి తనను ఆహ్వానించినందుకు బాలయ్యకు థ్యాంక్స్ కూడా చెప్పాడు. దీనికి సంబంధించిన వీరిద్దరి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.