Naga Chaitanya: కెరీర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కథకు నో చెప్పిన నాగ చైత్యన్య!

Naga Chaitanya: కెరీర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కథకు నో చెప్పిన నాగ చైత్యన్య!

నిన్ను కోరి, మజిలీ లాంటి ప్రేమకథా చిత్రాలతో దర్శకుడిగా మెప్పించిన శివ నిర్వాణ..రీసెంట్ గా విజయ్ దేవరకొండ, సమంత జంటగా ‘ఖుషి’ చిత్రాన్ని తెరకెక్కించి ఓ మోస్తరు హిట్ అందుకున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ముందు రెండు సినిమాలను బాగా హ్యాండిల్ చేసిన శివ నిర్వాణ ఖుషి సినిమా కథను ఇంకాస్తా బెటర్ గా రాసి ఉంటే..తనదైన శైలిలో హ్యాండిల్ చేయలేదనిపిస్తుంది.

ఇక అతని నుంచి వచ్చే తదుపరి సినిమా గురించి అప్డేట్ అయితే రాలేదు. రీసెంట్ గా  శివ నిర్వాణ అక్కినేని చైతన్యతో తన తదుపరి సినిమా ఒకే అయినట్లు వార్తలు వినిపించాయి.

కానీ, తాజా సమాచారం ప్రకారం..శివ నిర్వాణ రాసిన కథ చైతన్యకి నచ్చకపోవటంతో ఈ సినిమా ఆగిపోయిందని న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాని షైన్ స్క్రీన్ బ్యానర్ నిర్మించాల్సి ఉండేది. మంచి బంధాలు..ప్రేమానురాగాల మేళవింపుతో కథలు రాసుకునే  శివ నిర్వాణ ఇంకో కొత్త కథతో వస్తారా? లేకపోతే అదే కథతో వేరే హీరోని సెట్ చేస్తాడా? అనేది తెలియాల్సి ఉంది. 

ఇదివరకే చైతూ -శివ మజిలీ చిత్రం రికార్డ్ కలెక్షన్స్ తో పాటు ఎంతోమంది ప్రేమికుల హృదయాలను కదిలించింది. అంతటా పెద్ద హిట్ ఇచ్చిన డైరెక్టర్ కథకి..చై నో చెప్పాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం చై తండేల్ మూవీతో బిజీగా ఉన్నారు.