నాతో ఎప్పటికీ ఉండిపోతుంది

నాతో ఎప్పటికీ ఉండిపోతుంది

విభిన్నమైన కథలను ఎంచుకొని ప్రేక్షకులను అలరించడంలో ముందుండే నటుల్లో ఒకరైన నటుడు అమీర్ ఖాన్.. తాజాగా లాల్ సింగ్ చడ్డా అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీలో కరీనా కపూర్ కథానాయిక. త్రీ ఇడియట్స్ తర్వాత వీరిద్దరూ కలిసి మళ్లీ జంటగా నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ తెలుగు వెర్షన్ పోస్టర్ ను, దాంతో పాటు  ఈ మూవీలో నాగ చైతన్య  బాలరాజు పాత్రలో అలరిస్తారని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ నాగ చైతన్య మరో ట్వీట్ చేశారు. లాల్ సింగ్ చడ్డా... ఇది నాతో ఎప్పటికీ ఉండిపోతుంది. థ్యాంక్యూ బాల @అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ అంటూ చై పోస్ట్ చేశారు.

ఇక ఈ సినిమా నుంచి ఇప్ప్పటికే విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీ ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో సినిమా పై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాగా ఈ మూవీలో అమీర్ ఖాన్ , నాగచైతన్య స్నేహితులుగా నటిస్తున్నారు. ఆర్మీ నేపథ్యంలో సాగే ఈ దేశ భక్తి సినిమాలో బాలరాజు అనే పాత్రలో చైతు నటిస్తున్నాడు. తాజాగా నాగచైతన్య లుక్ ను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్- కిరణ్ రావు – వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మించాయి. ఈ ఏడాది ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు-, తమిళం, హిందీలో ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చైతన్య లుక్ ను పరిచయం చేసిన విషయం తెలిసిందే.