తండేల్ .. నా కెరీర్​లోనే సెన్సేషనల్ మూవీ : నాగచైతన్య

తండేల్ .. నా కెరీర్​లోనే   సెన్సేషనల్ మూవీ : నాగచైతన్య

కొత్త తరహా కథలు, డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌ సినిమాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌‌‌‌ను క్రియేట్ చేసుకున్న నాగచైతన్య.. త్వరలో  ‘దూత’ అనే వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. మరోవైపు చందు మొండేటి దర్శకత్వంలో ‘తండేల్‌‌‌‌’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. గురువారం తన పుట్టినరోజు. ఈ నేపథ్యంలో  తన కెరీర్‌‌‌‌‌‌‌‌ గురించి, కొత్త ప్రాజెక్టుల గురించి నాగచైతన్య చెప్పిన విశేషాలు.. 

 ఈ బ‌‌‌‌ర్త్ డే నాకెంతో స్పెషల్. ఈసారి ఫ్రెండ్స్‌‌‌‌, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేద్దామ‌‌‌‌నుకొంటున్నా. ఫ్యాన్స్‌‌‌‌కు కూడా సర్‌‌ప్రైజ్‌లు ఉన్నాయి. నా కొత్త చిత్రం ‘తండేల్’ టైటిల్, ఫస్ట్ లుక్ విడుదలైంది. అలాగే నా ఫస్ట్ వెబ్ సిరీస్ ‘దూత’ ట్రైల‌‌‌‌ర్ విడుద‌‌‌‌ల అవుతోంది. టెక్నికల్‌‌‌‌గా ఇది ఉన్నత స్థాయిలో వుంటుంది. విక్రమ్ కుమార్ అద్భుతంగా తీశారు. ప్రేక్షకులు సీట్ ఎడ్జ్ థ్రిల్ ఫీలౌతారు. సీజ‌‌‌‌న్ 1 హిట్టయితే త‌‌‌‌ప్పకుండా మ‌‌‌‌రో సీజ‌‌‌‌న్​తో ప్రేక్షకుల ముందుకు వ‌‌‌‌స్తాం.
 ‘తండేల్’ విషయానికొస్తే టీమ్ మొత్తం సూప‌‌‌‌ర్ కాన్సిడెన్స్‌‌‌‌గా ఉన్నాం. గత ఆరేడు నెల‌‌‌‌లుగా ఈ ప్రాజెక్ట్‌‌‌‌తో ట్రావెల్ చేస్తున్నా. ఇది నా కెరీర్ లో బిగ్ బడ్జెట్ సినిమా. చాలా పెద్ద కాన్వాస్, స్పాన్ ఉన్న కథ. టీమ్ అంతా ఎక్సయిటెడ్‌‌‌‌గా ఎదురుచూస్తున్నాం. కథ ప్రకారం కొంత ఇండియాలో, కొంత పాకిస్తాన్‌‌‌‌లో జరుగుతుంది. నా కెరీర్ లోనే 
సెన్సేషనల్ మూవీ అవుతుందని భావిస్తున్నా. 
 ఓ ఫిష‌‌‌‌ర్‌‌‌‌ మ్యాన్ జీవితంలో జ‌‌‌‌రిగిన కొన్ని ఇన్సిడెంట్స్‌‌‌‌ని సినిమాటిక్‌‌‌‌గా చూపించబోతున్నాం. ఇందులో ఓ చక్కని ప్రేమకథ కూడా ఉంది. 
ఫిష‌‌‌‌ర్‌‌‌‌ మ్యాన్ పాత్రకు తగ్గట్టుగా మేకోవర్ అయ్యాను. వాళ్ళ బాడీలాంగ్వేజ్‌‌‌‌కు తగ్గట్టుగా మారడానికి కొన్ని నెలల పాటు కష్టపడ్డాను. అంతేకాదు ఇందుకోసం శ్రీకాకుళంలోని కె.మత్స్యలేశం గ్రామానికి వెళ్లాం. అక్కడ పరిస్థితులని దగ్గరుండి అర్ధం చేసుకున్నాం. ఏ వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని దర్శకుడు చందు మొండేటి ఈ పాత్ర క్రియేట్ చేశాడో అతన్ని కలిసి మాట్లాడాను. 
 ఈ సినిమా కోసం శ్రీకాకుళం యాసను ప్రాక్టీస్ చేస్తున్నాను. నా బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డిక్షన్‌‌‌‌ను చందు పెక్యులర్‌‌‌‌‌‌‌‌గా డిజైన్ చేశాడు. ఇందులో కొత్త నాగచైతన్యని చూస్తారు. అలాగే ‘లవ్ స్టోరీ’ తర్వాత సాయిపల్లవితో మళ్లీ కలిసి నటిస్తున్నా. తన పాత్ర చాలా కీలకం. అద్భుతంగా నటించేందుకు అవకాశం వున్న పాత్ర. తన కెరీర్ లో కూడా ఇది చెప్పుకునే సినిమా అవుతుంది. డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి మూడు నెలలపాటు రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. అల్లు అర‌‌‌‌వింద్, బన్నీవాస్ గార్లతో పాటు టీమ్ అంతా చాలా కేర్ తీసుకుంటున్నాం. 
 నా కెరీర్‌‌‌‌‌‌‌‌లో పలు విజయాలు, అపజయాలు చూశాను. వాటన్నింటి నుంచి ఏదో ఒక‌‌‌‌టి 
నేర్చుకుంటూనే ఉన్నా.  కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇంకా మంచి సినిమాలు, పాత్రలు చేయాలి. చాలా సాధించాలి. ఆర్టిస్ట్ గా ఇంకా ఎదగాలి. దాని కోసం కృషి చేస్తూనే ఉంటాను. త్వరలో శివ‌‌‌‌నిర్వాణ‌‌‌‌తో ఓ సినిమా చేయబోతున్నా. ప్రస్తుతం చర్చలు జ‌‌‌‌రుగుతున్నాయి.