మే 12న నాగ చైతన్య ‘కస్టడీ’

మే 12న నాగ చైతన్య ‘కస్టడీ’

ఈ ఏడాది బంగార్రాజు, థ్యాంక్యూ, లాల్ సింగ్ చద్ధా లాంటి మూడు డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగ చైతన్య.. వచ్చే ఏడాది ‘కస్టడీ’ అనే యాక్షన్ మూవీతో రాబోతున్నాడు. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్నాడు. కృతిశెట్టి హీరోయిన్‌‌. తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్‌‌ పోస్టర్‌‌‌‌తో ఆకట్టుకున్న టీమ్, బుధవారం సినిమా రిలీజ్‌‌ డేట్‌‌ను అనౌన్స్ చేశారు. 

వచ్చే ఏడాది మే 12న ఈ మూవీని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. హై టెక్నికల్ వ్యాల్యూస్‌‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అరవింద్ స్వామి విలన్‌‌గా నటిస్తున్నారు. ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ ఇతర ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి సంగీతం అందిస్తున్నారు.