విడాకులకు కారణం ఆ సిరీసే అన్నారు.. కానీ నాకు అదే ఇష్టం

విడాకులకు కారణం ఆ సిరీసే అన్నారు.. కానీ నాకు అదే ఇష్టం

అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ (Custody). ఈ మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో వరుసగా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న చైతన్య.. ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇందులో భాగంగానే.. సమంతతో తన విడాకుల గురించి మొదటిసారి స్పందించాడు. "సోషల్ మీడియాలో వచ్చన వార్తలు వల్లే వారిద్దరూ విడిపోవాల్సి వచ్చిందని చెప్పి అందరికీ షాకిచ్చాడు చైతన్య. ఇక సమంత చాలా మంచి అమ్మాయి అంటూ, తను ఎప్పుడు సంతోషంగా ఉండాలంటూ చేసిన కామెంట్స్ చాలా వైరల్ అయ్యాయి.

ఇక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మరో ఆసక్తికర విషయాన్ని బయట పెట్టాడు చైతన్య. సమంత నటించిన సినిమాల్లో మీకు ఏదంటే ఇష్టం అని ప్రశ్నించగా.. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ (The Family Man) అంటే ఇష్టమని, ఆ తరువాత ‘ఓ బేబీ’ సినిమా అంటే ఇష్టమని చెప్పిన చై.. ఇప్పటికి తన ప్రతి మూవీ చూస్తానని తెలియజేశాడు. ఇక వీరిద్దరి మధ్య విబేధాలు రావడానికి కారణం ఫ్యామిలీ మ్యాన్ సిరీసే కారణమనే వార్తలు అప్పట్లో వినిపించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు నాగచైతన్య ఆ సిరీసే తనకి ఇష్టమంటూ చెప్పడంతో ఆ వార్తలన్నీ ఫేక్ అని తెలిసిపోయింది.

ఇక ఇదే ఇంటర్వ్యూలో సమంత వర్క్ గురించి మాట్లాడిన చైతన్య.. "తను చాలా హార్డ్ వర్కర్ అని, ఏదైన కావాలని అనుకుంటే దాని కోసం ఎంత దూరం అయినా వెళ్తుందని” చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చై చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి.