నాగశౌర్య హీరోగా రామ్ దేశిన (రమేష్) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. శ్రీ వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నట్టు తెలియజేశారు మేకర్స్.
ఇప్పటికే 60శాతం షూటింగ్ పూర్తయిందని, త్వరలోనే టైటిల్, ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు. రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, సముద్రఖని, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, అజయ్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్‌కుమార్, సుదర్శన్, కృష్ణుడు, చమ్మక్ చంద్ర, పృథ్వీ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి హారిస్ జైరాజ్‌సంగీతం అందిస్తున్నాడు.