
ఇన్నాళ్లు తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానన్నారు నటుడు నాగబాబు. ఒక రకంగా ఆపదలు, కష్టాలే తనను పూర్తి మనిషిగా మలిచాయంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘ఇన్నాళ్ల నా జీవితంలో.. ఎన్నో ఒడిదుడుకులను చూసి, ఎన్నో విపత్తులను ఎదుర్కొని నన్ను నేనుగా మార్చుకోగలిగాను. ఒక రకంగా చూస్తే ఈ ఆపదలు, కష్టాలే నన్ను ఒక పూర్తి మనిషిగా మలచడానికి ఎంతగానో సహాయపడ్డాయి. నేను పుట్టి పెరిగిన నా దేశానికి, నా తోటి ప్రజలకు సహాయ పడాలని నిర్ణయించుకొని అదే గమ్యంగా నా లక్ష్యం వైపు పయనించాను. ఈ పయనంలో నాకు ఎన్నో ఒడిదుడుకులు, ఆటంకాలు ఎదురైనా కానీ..నన్ను ప్రతిసారి వెన్నంటి నడిపించి నాకు మనిషిగా ఎదిగే అవకాశాన్ని ఇచ్చింది కూడా ఈ కష్టాలే. అందుకే ఇప్పటి నుంచి నా పూర్తి సమయాన్ని నా గమ్యం దిశగా ప్రయాణం కొనసాగించడానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నా. మరిన్ని వివరాలతో త్వరలో మీ ముందుకొస్తా. ఈ బాటసారి ప్రయాణం కొనసాగుతుంది అని నాగబాబు పోస్ట్ చేశారు.
ఈ బాటసారి ప్రయాణం కొనసాగుతుంది... pic.twitter.com/OcuygCcMHv
— Naga Babu Konidela (@NagaBabuOffl) March 12, 2022