తెలుగు బిగ్‌బాస్: ప్రేమ కథల గుట్టు రట్టు 

తెలుగు బిగ్‌బాస్: ప్రేమ కథల గుట్టు రట్టు 

బిగ్‌బాస్ ఆరో సీజన్ మొదలై అప్పుడే మూడు వారాలు అయిపోయింది. రకరకాల ట్విస్టులతో ఆట బాగానే కొనసాగుతోంది. అయితే ప్రతి వీకెండ్‌కీ వచ్చి నాగార్జున ఇచ్చే ఊహించని ట్విస్ట్ కంటెస్టెంట్లని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పోయిన వారం డబుల్ ఎలిమినేషన్ చేసి అందరికీ షాకిచ్చారాయన. మరి ఈవారం అలాంటి ట్విస్ట్ ఏదైనా ఉందా? హౌస్‌మేట్స్ ఆట తీరుపై నాగార్జున రియాక్షన్ ఏంటి?

కౌంటర్‌‌.. ఎన్‌కౌంటర్

ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ముందు రోజు కంటెస్టెంట్లందరి మధ్య జరిగిన చర్చల్ని కాసేపు అబ్జర్వ్ చేశారు నాగ్. ఆ తర్వాత వారిని పలకరించారు. పోయిన వారంలాగే ఈవారం కూడా కొందరిని సోఫా వెనక్కి పంపించారు. ఆ తర్వాత కౌంటర్లు వేయడం స్టార్ట్ చేశారు. బ్యాడ్‌ ప్లేయింగ్‌ని నిర్మొహమాటంగా ఎన్‌కౌంటర్ చేశారు. అడవిలో ఆట టాస్క్ లో బాలాదిత్య ఆటతీరు ఏమాత్రం బాలేదని చెప్పారు నాగ్. తాను బాగానే ఆడానని అతను సమర్థించుకోవడంతో అతను ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చున్న వీడియోని చూపించి మరీ ఆటలో ఫెయిలైన విషయాన్ని ప్రూవ్ చేశారు. బాగా తయారవ్వడంతో పాటు ఆట కూడా బాగా ఆడితే మంచిదని వాసంతికి మరోసారి అడ్వైజ్ ఇచ్చారు. మీ ఆట ఇంకా మెరుగుపర్చుకోవాల్సి ఉందంటూ మెరీనా, రోహిత్‌లకి కూడా సలహా ఇచ్చారు. జంటగా మీకు టెన్‌ మార్క్స్ ఇస్తాను కానీ ఆటకి మాత్రం ఐదు మార్కులే వేస్తానన్నారు. ఇక ప్రతిదానికీ ఏడుస్తున్న కీర్తికి చిన్నపాటి క్లాస్ పీకారు. మనసులో ఎంత దు:ఖం ఉన్నా, మనం కార్చే కన్నీటికి విలువ ఉండాలని చెప్పారు. సుదీప ఆటకి కేవలం నాలుగు మార్కులే వేశారు. రాజ్‌ ఆటకి కూడా తక్కువ మార్కులు వేసి సోఫా వెనక్కి పంపేశారు. అర్జున్‌కి కూడా తక్కువ మార్కులిచ్చి వెనక నిలబడమన్నారు. మాట తీరు, మనిషి తీరు బాగున్నా ఆట ఇంకా ఇంప్రూవ్ కావాలని చంటికి చెప్పారు. వెనక్కి పంపారు.

ఆటలో బెస్ట్ అయినా..

గతవారం వరస్ట్ ప్లేయర్స్ లిస్టులో ఉన్న శ్రీసత్య ఈవారం నాగ్‌తో బెస్ట్ అనిపించుకుంది. ఒక్కసారిగా చాలా చేంజ్ అయ్యావు, వందకి రెండొందల పర్సెంట్ ఇచ్చావు అంటూ ఆమెని మెచ్చుకున్నారాయన. మరికొంతమంది ఆట తీరుకి కూడా ప్రశంసలు దక్కాయి. అయితే వాళ్ల ఆట బాగున్నా.. మాట తీరు, మనిషి తీరు విషయంలో క్లాస్ తప్పలేదు. శ్రీహాన్ ఆట సూపర్‌‌గా ఉందంటూ మెచ్చుకున్న నాగ్.. ఇనయాని పిట్ట అనడం కరెక్ట్ కాదని తప్పుబట్టారు. నిన్ను వాడు అంటే తట్టుకోలేనప్పుడు ఆమెని పిట్ట అంటే బాధపడకుండా ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు. రేవంత్‌కి కూడా సేమ్‌ లెసన్ చెప్పారు. ఆట ఎంత బాగున్నా నీ మాట తీరు మార్చుకోవాలన్నారు. వాడు అన్నంత మాత్రాన లాగి కొట్టేస్తానంటావా, నీ సంస్కారం ఏమైంది అని క్వశ్చన్ చేశారు. నేహ ఆట బాగున్నా చెంప పగులగొట్టింది అని ఇనయా మీద లేనిపోని నిందలు వేయడం కరెక్ట్ కాదన్నారు. నేనలా అనలేదు అని నేహ వాదించడంతో వీడియో కూడా చూపించారు. ఆదిరెడ్డి మనిషిగా బెస్ట్ అని, ఆట తీరుకి తొమ్మిది మార్కులు వేస్తానని మెచ్చుకున్న ఆయన.. రివ్యూలు చెప్పడం మాత్రం మానుకోవడం లేదని మరోసారి హెచ్చరించారు. ఇనయా ఆట చాలా బాగుంటోందని, మాట మాత్రం బాగా తూలుతోందని, ఒకే పాయింట్‌ని పదే పదే పట్టుకుని లాగడం కరెక్ట్ కాదని చెప్పారు. ఫైమా ఆటని సపోర్ట్ చేయడంలో తప్పు లేదని, ఎదుటివాళ్ల మీద నిందలు వేయడం మాత్రం తప్పని చెప్పారు. ఇక సూర్య మాటతీరుకి పది మార్కులు, ఆట తీరుకి తొమ్మిది మార్కులు ఇచ్చారు. ఫైమా చాలా బాగా ఆడుతోందంటూ తొమ్మిది మార్కులు వేసిన నాగ్.. అస్తమానం రివెంజ్ తీర్చుకున్నాడని రేవంత్‌ని అనొద్దన్నారు. ఆ రోజు నువ్వు చేతితో బ్రిక్స్ని సర్దడం నిజమేనంటూ వీడియో చూపించి మరీ చెప్పారు. 

గీతూకి నోటిదూల ఉందా?

ఎపిసోడ్ స్టార్టింగ్‌లో అందరూ కబుర్లాడుకుంటున్నప్పుడు రేవంత్‌కి, ఇనయాకి బాగా నోటిదూల అంటూ స్టేట్‌మెంట్స్ ఇచ్చింది గీతూ. కానీ తనకి మాత్రం నోటిదూల  లేదన్నట్టు ఫీలయ్యింది. పైగా నాకు నోటిదూల ఉందా అంటూ ఆదిరెడ్డిని పదే పదే ప్రశ్నించింది. ఆమె అలా అంటున్నప్పుడు ఆడియెన్స్ తెగ నవ్వుకున్నారు. ఈ విషయాన్ని తర్వాత నాగ్ టార్గెట్ చేశారు. ముందుగా గీతూ ఆటని మెచ్చుకున్న నాగ్.. ఇనయా విషయంలో చేసింది తప్పని ఎత్తి చూపించారు. వాళ్లిద్దరి మధ్యలోకి నువ్వెందుకు దూరావ్ అని అడిగితే.. ఆ అమ్మాయి నన్ను నామినేషన్‌ టైమ్‌లో మాట్లాడనివ్వనందుకు పగ తీర్చుకున్నానంది గీతూ. అలా చేయొద్దని, ఎప్పటి కోపం అప్పుడు తీర్చుకోమని అన్నారు. పైగా తను మాట్లాడుతుంటే నువ్వు దొబ్బెయ్ అనడం కరెక్టేనా, ఇది నోటి దూల కాదా అని అడిగారు. ఇంకో సమయంలో గీతూ ఏదో అంటుంటే కూడా ఇదే నోటి దూలంటే అన్నారు. తన ఆటకి పది మార్కులు వేస్తున్నానని చెప్పిన ఆయన.. మాట తీరుకి మాత్రం ఏడు మార్కులే ఇచ్చారు. అయితే ఏమాత్రం ఫేక్‌గా లేకుండా ఫెయిర్‌‌గా ఉంటున్నందుకు మనిషి తీరుకి నైన్ మార్క్స్ వేశారు. 

ప్రేమకథల గుట్టు రట్టు

బిగ్‌బాస్ హౌస్‌లో కొన్ని లవ్‌స్టోరీస్ నడుస్తున్న సంగతి తెలిసిందే. వీటి గుట్టుని ఇవాళ రట్టు చేశారు నాగ్. అర్జున్‌ పేరు చెప్పగానే ఆడియెన్స్ నవ్వుతున్నారు అని కామెంట్ చేసిన ఆయన.. ఎందుకు నవ్వుతున్నారో చెప్పమంటూ వాళ్లనే అడిగారు. అప్పడొకామె.. శ్రీసత్య ప్రేమ కోసం అర్జున్ తెగ ఆరాటపడుతున్నాడని, ఆమె మాత్రం పట్టించుకోవట్లేదని చెప్పింది. ఆ తర్వాత బంగారు బొండాం శ్రీసత్యకి ఎందుకిచ్చావంటూ అర్జున్‌ని కాసేపు ఆట పట్టించారు నాగ్. అదే ప్లేస్‌లో రేవంత్ ఉంటే ఇస్తావా అని అడిగితే ఇవ్వనని చెప్పాడు అర్జున్. దాంతో నాగ్‌తో పాటు అందరూ తెగ నవ్వారు. నేను కోపంగా అడిగానని ఇచ్చాడు సర్ అని శ్రీసత్య చెబితే.. నువ్వెలా అడిగినా ఇచ్చేస్తాడులే అంటూ నవ్వేశారు. అలాగే ఆరోహి, సూర్యలను కూడా విడిచిపెట్టలేదు నాగార్జున. ఇన్‌డైరెక్ట్గా చాలా సెటైర్లు వేశారు. సీక్రెట్‌గా వండి పెట్టుకోవడం దగ్గర్నుంచి రహస్యంగా గుసగుసలాడుకోవడం వరకు అన్నింటి విషయంలోనూ తమాషా చేశారు. చివరికి ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఒక ఫొటోని కూడా రివీల్ చేసి ఆరోహి, సూర్యలకి గట్టి షాకిచ్చారు. 

షాకింగ్ ట్విస్ట్

పోయినవారం కంటే కాస్త ఘాటు తగ్గినా.. క్లాస్ తీసుకోవడంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు నాగ్. కాకపోతే కాస్త నవ్వుతూ తీర్పులు చెప్పారు. తిట్టినట్టు కాకుండా వివరించి చెబుతున్నట్టుగా మాట్లాడారు. అయితే ఇవాళ్టి ఎపిసోడ్‌లో ఒక ఊహించని ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున. ఇద్దరిని నేరుగా నామినేట్ చేసే అధికారాన్ని బిగ్‌బాస్ తనకి ఇచ్చారని చెప్పారు. సోఫా వెనుక ఉన్న ఎనిమిదిమందిలో ఎవరిని మీరు నామినేట్ చేస్తారో చెప్పమంటూ ఒక్కో పేరూ చెప్పారు. హౌస్‌మేట్స్ చేతులు ఎత్తినదాన్ని బట్టి ఓట్లు లెక్కించారు. అర్జున్‌కి ఐదు, బాలాదిత్యకి మూడు, సుదీపకి మూడు, వాసంతికి రెండు, చంటికి ఒకటి, రాజ్‌కి నాలుగు, మెరీనా–రోహిత్‌లకి ఒకటి, కీర్తి ఐదు ఓట్లు వచ్చాయి. అత్యధికంగా ఐదేసి ఓట్లు వచ్చిన కీర్తి, అర్జున్‌లను నాగ్ నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్లకి నామినేట్ చేశారు. వీళ్లిద్దరి ఆట తీరు ఎలా ఉంటుందో గమనించి ఓట్లు వేయమని ప్రేక్షకుల్ని కోరారు. అంటే బహుశా సోమవారం జరిగే నామినేషన్‌ రౌండ్‌లో ఈ ఇద్దరి పేర్లు ఎవరూ చెప్పడానికి ఉండదు. 


    
ఇక ఈ వారం ఇంటి నుంచి ఒకరిని బయటికి పంపే ప్రక్రియ ఒక్కటే మిగిలింది. రేపు నాగ్ ఎవరిని సేవ్ చేస్తారో, ఎవరిని ఎలిమినేట్ చేస్తారోననే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది. అయితే ఈ వారం ఇనయా బైటికి వెళ్లిపోతుందంటూ మొదట ప్రచారం జరిగింది. ఆ తర్వాత వాసంతి పేరు బైటికొచ్చింది. కానీ వీకెండ్ వచ్చేసరికి ఆ ఇద్దరూ కాదు.. నేహ వెళ్లిపోతుందని అంటున్నారు. మరి వీటిలో ఏది నిజమవుతుందో, వీరిలో ఎవరు ఇంటి నుంచి వెళ్లిపోతారో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే.