Naa Saami Ranga Business: నాగ్ కాన్ఫిడెన్స్తో..నా సామిరంగని సెట్ చేసాడు

Naa Saami Ranga Business: నాగ్ కాన్ఫిడెన్స్తో..నా సామిరంగని సెట్ చేసాడు

టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna) కెరీర్ లో 99వ సినిమాగా రానున్న నా సామి రంగా(Naa Saami Ranga) మూవీ జెడ్ స్పీడ్తో దూసుకొచ్చేసింది. 2023 ఆగస్టు 29 నాగార్జున పుట్టినరోజు సందర్భంగా షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ సినిమా..సంక్రాంతి బరిలో నిలిచేలా చేశాడు నాగ్. సినిమా అంటే పండుగ..ఇక సంక్రాంతి అంటే నాగ్ కి సినిమా పండగ. తనదైన సినిమాలతో ప్రతి సంక్రాంతికి నాగ్ మార్క్ సినిమా ఉండేలా ప్లాన్ చేస్తాడు. అలా ఈ సారి సంక్రాంతికి వస్తోన్న నా సామి రంగ ధైర్యం ఏంటో చూద్దాం. 

నా సామిరంగ బిజినిస్ లెక్కలు చూసుకుంటే.. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను నాగ్ కొనేసినట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ  నా సామిరంగ సినిమాని తన సొంత బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ మీదే డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా నాన్ థియేట్రికల్ బిజినెస్ రూ. 32 కోట్లు జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ కోసం ఈ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. 

 శాటిలైట్ హక్కులని స్టార్ మా, డిజిటల్ హక్కులని హాట్ స్టార్కి కొనుగోలు చేసింది. నా సామీ రంగ సినిమా బడ్జెట్ చూసుకుంటే..రూ. 45 కోట్లు కాగా, ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ మీద రూ. 32 కోట్లు వచ్చాయి. అంటే, మేకర్స్ ఈ సినిమా కోసం పెట్టిన బడ్జెట్ లో మూడొంతుల మేరకు డబ్బులు వచ్చేసినట్లు అయ్యింది. దీంతో అటు థియేట్రిక్ బిజినెస్ కూడా దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల ఏరియాల్లో కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.

ఈ లెక్కన చూసుకుంటే నాగ్ చొరవతో.. ‘నా సామిరంగ’ లెక్కల్లో ఫస్ట్ మార్కులు తెచ్చేసుకుంది. దీంతో సినిమా రిలీజ్ కు ముందే..నిర్మాతలు నష్టపోకుండా..లాభాలు మాత్రమే వచ్చేటట్లు చేసిన ప్లాన్ వర్కౌట్ అయింది.  మొత్తానికి నా సామీ రంగ మూవీతో..నాగార్జునకు సంక్రాంతి పండగ సెంటిమెంట్ కలిసొచ్చేలా ఉంది.

ప్రముఖ నృత్య దర్శకుడు విజయ్ బిన్నీ(Vijay binny) తెరకెక్కిస్తున్న ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ మూవీకి ఆస్కార్ విన్నర్స్ అయిన..హిట్ మ్యూజికల్ పెయిర్ కీరవాణి-చంద్రబోస్ వీరిద్దరూ కలిసి పనిచేతిశున్నారు. ఈ సినిమా జనవరి 14న థియేటర్లో రిలీజ్ కానుంది. 

  • Beta
Beta feature