
టాలీవుడ్ కింగ్ నాగార్జున(Nagarjuna) ఈ సంక్రాంతికి నా సామిరంగ(Naa Saamiranga) సినిమానతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ(Vijay Binny) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అల్లరి నరేష్(Allari Naresh), రాజ్ తరుణ్(Raj tharun) ముఖ్య పాత్రలు కనిపించగా.. ఆషికా రంగనాథ్(Ashika Ranganath), మిర్నా మీనన్(Mirna Menon), రుక్సార్ థిల్లాన్ హీరోయిన్స్ గా నటించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాపై ముందునుండి మంచి అంచనాలు ఏర్పడగా.. టీజర్, ట్రైలర్ తో ఆ అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా నేడు (జనవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలా చోట్ల షోస్ పడటంతో.. సినిమా చూసిన నాగార్జున ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.
అవుట్ అండ్ అవుట్ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని, నాగార్జున మెంటల్ మాస్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశారని, ఇంట్రో ఫైట్ సీక్వెన్స్, లవ్ ట్రాక్స్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో.. ఇంటర్వెల్ సీక్వెన్స్ ప్యూర్ గూస్బంప్స్ అని, నాగార్జున ఐకానిక్ టెంప్లెట్ సైకిల్ చైన్ సీన్ రిఫరెన్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే నాగార్జున సంక్రాంతికి మరోసారి అదిరిపోయే హిట్టు కొట్టారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.