
ఓ వైపు హీరోగా చేస్తూనే, మరోవైపు మల్టీస్టారర్ మూవీస్‌లోనూ నటిస్తున్నారు నాగార్జున. గురువారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా నాగార్జున నటిస్తున్న చిత్రాల నుంచి కొత్త లుక్స్‌ను రిలీజ్ చేస్తూ విషెస్‌ను తెలియజేశారు మేకర్స్. ధనుష్‌తో కలిసి నాగార్జున నటిస్తున్న సినిమా ‘కుబేర’. ఈ చిత్రంనుంచి ఇప్పటికే నాగ్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయగా, ఆయన బర్త్‌డే సందర్భంగా మరో కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో స్టైలిష్ గెటప్‌లో ఉన్న నాగార్జున.. ఎదురుగా ఉన్నవారిని ఆప్యాయంగా పలకరిస్తూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.
రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జిమ్ సర్భ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కోలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులో నాగార్జున భాగమైనట్టు గురువారం ప్రకటించారు. రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కూలీ’ చిత్రంలో ఆయన ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్టు రివీల్ చేశారు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్‌తో పాటు ఆయన పాత్రను కూడా పరిచయం చేశారు. వింటేజ్ లుక్‌లో గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తున్న నాగార్జున ఇందులో ‘సైమన్’ పాత్రలో కనిపించనున్నట్టు ప్రకటించారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.