సాగర్‌‌, పులిచింతలలో... రికార్డు స్థాయి విద్యుత్‌‌ ఉత్పత్తి

సాగర్‌‌, పులిచింతలలో... రికార్డు స్థాయి విద్యుత్‌‌ ఉత్పత్తి
  • మూడు నెలల్లోనే టార్గెట్‌‌ను పూర్తి చేసిన నాగార్జున సాగర్‌‌ పవర్‌‌ హౌస్‌‌
  • పులిచింతల వద్ద టార్గెట్‌‌ను మించి 150 మిలియన్‌‌ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి 

నల్గొండ, వెలుగు : ఈ ఏడాది నాగార్జున సాగర్‌‌‌‌, పులిచింతల ప్రాజెక్ట్‌‌లకు భారీ స్థాయిలో వరద రావడంతో రికార్డు స్థాయిలో విద్యుత్‌‌ ఉత్పత్తి జరిగింది. నాగార్జునసాగర్‌‌ మెయిన్‌‌ పవర్‌‌హౌస్‌‌ 1922 మిలియన్‌‌ యూనిట్ల ఉత్పత్తి టార్గెట్‌‌ నవంబర్‌‌ 30 నాటికే చేరుకోగా.. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 2,572.04 మిలియన్‌‌ యూనిట్ల విద్యుత్‌‌ ఉత్పత్తి సాధించింది. చింతలపాలెం మండలంలోని  పులిచింతల పవర్‌‌ హౌస్‌‌ సైతం ప్లాంట్ నిర్మించిన నాటి నుంచి ఎన్నడూ లేనంతగా ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 325 మిలియన్‌‌ యూనిట్ల విద్యుత్‌‌ను ఉత్పత్తి చేసి రికార్డు నెలకొల్పింది.

సాగర్‌‌లో ఎనిమిది యూనిట్ల ద్వారా...

నాగార్జునసాగర్‌‌ పవర్‌‌హౌస్‌‌లో మొత్తం ఎనిమిది యూనిట్లు ఉన్నాయి. గతంలో మొదటి యూనిట్‌‌ రిపేర్‌‌కు గురికావడంతో 20 నెలలుగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. గతేడాది ఆగస్ట్‌‌లో మొదటి యూనిటర్‌‌ రిపేర్లు పూర్తి కావడంతో మొత్తం 8 యూనిట్ల ద్వారా 8. 17 మెగావాట్ల విద్యుత్‌‌ను ఉత్పత్తి చేస్తున్నారు. 2021 – 22 సంవత్సరంలో ఉత్పత్తి టార్గెట్‌‌ 1,535 మిలియన్ యూనిట్లు కాగా 2,262 మిలియన్ల యూనిట్లు ఉత్పత్తి చేయగా..2022 – 23లో 1500 మిలియన్‌‌ యూనిట్ల టార్గెట్‌‌కు 2,355 మిలియన్‌‌ యూనిట్ల ఉత్పత్తి జరిగింది.

2023 – 24లో 1,400 మిలియన్‌‌ యూనిట్ల ఉత్పత్తి టార్గెట్‌‌గా పెట్టుకోగా.. నీటి లభ్యత లేని కారణంగా కేవలం 540 మిలియన్ యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేశారు. 2024 – 25లో 1,400 మిలియన్ యూనిట్ల లక్ష్యానికి 1,922 మిలియన్‌‌ యూనిట్లు ఉత్పత్తి చేయగా.. 2025 - – 26లో టార్గెట్‌‌ 1,922 మిలియన్‌‌ యూనిట్లు అయితే.. ఏకంగా 2,572.04 మిలియన్‌‌ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. 

పులిచింతల జెన్‌‌కో మరో రికార్డు...

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని తెలంగాణ జెన్‌‌కో మరో రికార్డును నమోదు చేసింది. ఈ ప్లాంట్‌‌లో మొత్తం నాలుగు యూనిట్ల ద్వారా 120 మెగావాట్ల విద్యుత్‌‌ ఉత్పత్తిని చేయొచ్చు. ఇక్కడ 2020 – 21లో 201.33 మిలియన్‌‌ యూనిట్లు, 2021 – 22లో 314.55 మిలియన్ యూనిట్లు, 2022  – 23లో 324.30 మిలియన్‌‌ యూనిట్లు, 2023- – 24లో 101.95 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయగా.. 2024 – -25లో 268.59 మిలియన్ యూనిట్ల విద్యుత్‌‌ ఉత్పత్తి చేయగా... ఈ ఏడాది అత్యధికంగా 325.05 మిలియన్‌‌ యూనిట్లు ఉత్పత్తి జరిగింది. ఈ సంవత్సరం అంచనాకు మించి వరద రావడంతో టార్గెట్‌‌ కంటే 125 మిలియన్‌‌ యూనిట్ల ఎక్కువ ఉత్పత్తి జరిగినట్లు ఎస్‌‌ఈ దేశ్యానాయక్‌‌ వెల్లడించారు.