హాలియా, వెలుగు: నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు ఎన్ఎస్పీ అధికారులు బుధవారం 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రెండు రోజుల కింద ఎన్ఎస్పీ అధికారులు ఎడమ కాల్వకు నీటిని నిలిపివేశారు.
కాగా, గణేశ్నిమజ్జనం నేపథ్యంలో కాల్వలో తగినంత నీటి ప్రవాహం లేకపోవడంతో ప్రభుత్వ సూచన మేరకు అధికారులు ఎడమ కాల్వకు తిరిగి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం సాగర్ ఆయకట్టు ప్రాంతంలో పలు మండలాల్లో సాగుచేసిన వరి పొలాలకు ఎంతో మేలు జరగనుందని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
