హాలియా, వెలుగు: వైద్యం వికటించి అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న చిన్నారులను నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ కమల నెహ్రూ ఏరియా హాస్పిటల్ లో శనివారం రాత్రి నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి పరామర్శించారు.
ఎమ్మెల్యే పిల్లల వార్డును తనిఖీ చేసి తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైద్యాధికారులతో మాట్లాడి సంఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకొని బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. రేపటి లోగా పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశించారు.
