
సంక్రాంతికి ‘బంగార్రాజు’తో సూపర్ హిట్ అందుకున్న నాగార్జున, ప్రస్తుతం ‘ద ఘోస్ట్’ సినిమాలో నటిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై థ్రిల్లర్‌లో సోనాల్ చౌహాన్ హీరోయిన్. నారాయణ్ దాస్ కె నారంగ్, పి.రామ్‌మోహన్ రావు, శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్‌లో షూటింగ్ జరుగుతోంది. ఇందుకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్‌ని నిన్న విడుదల చేశారు. నాగార్జునతో పాటు సోనాల్ కూడా షూట్‌లో పాల్గొంటోంది. ఇక్కడ మూడు భారీ యాక్షన్ సీక్వెన్సులు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. థాయిలాండ్‌కు చెందిన ప్రముఖ స్టంట్ డైరెక్టర్ ఈ సీన్స్ కంపోజ్ చేశాడు. పోయినేడు ఫిబ్రవరిలోనే మొదలైన ఈ మూవీ కొవిడ్ కారణంగా ఆలస్యమైంది. ఇప్పుడు శరవేగంగా షూటింగ్ సాగుతోంది. ఈ సంవత్సరమే మూవీ రిలీజయ్యే చాన్సెస్ ఉన్నాయి. నాగ్ నటించిన ‘బ్రహ్మాస్త్ర’ కూడా ఈ సంవత్సరమే విడుదలవుతోంది. సెప్టెంబర్ 9న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రానుంది.