పీఆర్ఎల్ఐ జాతీయ హోదా కోసం కొట్లాడుతా : మల్లు రవి

పీఆర్ఎల్ఐ జాతీయ హోదా కోసం కొట్లాడుతా : మల్లు రవి
  •     నాగర్​కర్నూల్​ కాంగ్రెస్​ ఎంపీ క్యాండిడేట్​ మల్లు రవి

జడ్చర్ల టౌన్, వెలుగు : నాగర్​కర్నూల్​ ఎంపీగా తనను గెలిపిస్తే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్​ జాతీయ హోదా కోసం కొట్లాడతానని నాగర్​కర్నూల్  ఎంపీ క్యాండిడేట్​ మల్లురవి తెలిపారు. సోమవారం జడ్చర్లలో మీడియాతో మాట్లాడుతూ పాలమూరు–రంగారెడ్డికి జాతీయ హోదాతో పాటు జిల్లాలో భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టుల్లో మిగిలిన 10శాతం పనులను పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు.

అలంపూర్, కొల్లాపూర్, నాగర్​ కర్నూల్, అచ్చంపేట​మీదుగా హైవే నిర్మించి, నల్గొండ హైవేకు లింక్​ చేయాలని ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీని కోరినట్లు చెప్పారు. కృష్ణా నది పరివాహక ప్రాంతం ఉన్న దృష్ట్యా, ఇక్కడికి నీటిపై ఆధారపడే పరిశ్రమలను తీసుకువస్తానని తెలిపారు.