
పాలమూరు, వెలుగు: పాలమూరు అభివృద్ధికి కృషి చేసిన వారిలో స్వర్గీయ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి ముందు వరుసలో ఉంటారని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తెలిపారు. కాంగ్రెస్ నేత బెక్కరి మధుసూదన్‌రెడ్డి ఇంట్లో బుధవారం మీడియాతో మాట్లాడారు. గురువారం జగదీశ్వర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మహబూబ్ నగర్ నగరంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో ఆయన విగ్రహాన్ని రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఆవిష్కరిస్తారని చెప్పారు.
పార్టీలకతీతంగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అభిమానులు తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి విగ్రహావిష్కరణ ప్రదేశాన్ని సందర్శించారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్దన్ రెడ్డి, వినోద్ కుమార్, సీజే బెనహర్, అజ్మత్ అలీ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.