కామారెడ్డి, వెలుగు : పంచాయతీ ఎన్నికల విధుల్లో అలసత్వం వహించిన నాగిరెడ్డిపేట ఎంపీడీవో లలితాకుమారి, ఎంపీవో ప్రభాకర్చారిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశాలు జారీ చేశారు. నాగిరెడ్డిపేట మండలంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 30 నుంచి 2 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగింది.
సర్పంచ్లు, వార్డు మెంబర్ స్థానాలకు వచ్చిన వివరాలు పంపడంలో నిర్లక్ష్యం, నామినేషన్ల వివరాల్లో తేడాలు ఉండటం, ఎంపీడీవో, ఎంపీవో స్థానికంగా అందుబాటులో లేకపోవడం వంటి విషయాలు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చాయి. కలెక్టర్ ఆదేశాలతో డివిజన్ స్థాయి అధికారులు ఎంక్వైరీ చేసి ఉన్నతాధికారులకు రిపోర్టు పంపారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినందున కలెక్టర్ సీరియస్గా తీసుకున్నారు. ఎంపీడీవో, ఎంపీవో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
