హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి 67,471 క్యూసెక్కుల వరద వస్తుండడంతో సాగర్ వద్ద రెండు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 16,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి కుడి కాల్వకు 10 వేల క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 5,367, ఏమ్మార్పీకి 1800, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 34,104 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
