భక్తి శ్రద్ధలతో నాగుల పంచమి పూజలు

భక్తి శ్రద్ధలతో నాగుల పంచమి పూజలు

నాగుల పంచమి సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. నాగదేవతకు భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తున్నారు. పుట్టల్లో పాలు పోయడానికి భక్తులు క్యూ కడుతున్నారు. ఆలయాలను పూజారులు సుందరంగా అలంకరించారు. రాజన్ని సిరిసిల్లా జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. 

అభిషేకాలు, పాలు, పండ్లు, పసుపు కుంకుమతో భక్తి శ్రదలతో పూజలు నిర్వహిస్తున్నారు. పుట్ట వద్ద పాలు పోసి, స్వామి వారికి ఎంతో ఇష్టమైన కోడే మొక్కులను చెల్లించుకుంటున్నారు.  

 

కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని జమ్మికుంట శ్రీ విశ్వేశ్వర దేవాలయం, కొండగట్టు, ధర్మపురి, కోటిలింగాల ఆలయాల్లో భక్తుల రద్దీలో నెలకొంది. నాగుల పంచమి పురస్కరించుకుని తెల్లవారుజామున నుండి పుట్టలో పాలు పోయడానికి భక్తులు బారులు తీరారు.పైగా శ్రావణ మాస మొదటి సోమవారం కావడంతో భక్తులు గోదావరిలో పుణ్య స్థానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.