- నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్
నల్గొండ, వెలుగు: నానో ఎరువుల వినియోగం ద్వారా రైతులను సుస్థిర వ్యవసాయం వైపు ప్రోత్సహించాలని నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ వ్యవసాయ అధికారులకు సూచించారు. మంగళవారం తిప్పర్తి మండలం దుప్పలపల్లి రైతు వేదికలో నిర్వహించిన సాంకేతిక ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. డ్రోన్ సాంకేతికతతో నానో యూరియాను సమర్థవంతంగా ఉపయోగించి దిగుబడులు పెంచుకోవాలని రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతులు కేవలం వరికే పరిమితం కాకుండా పంట మార్పిడిపై దృష్టిపెట్టాలని సూచించారు. నకిలీ పత్తి విత్తనాల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాకు కేటాయించిన 10 వేల సాయిల్ హెల్త్ కార్డులను త్వరగా పంపిణీ చేసి భూసార రక్షణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం
మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, వారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు అందరూ సహకరించాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు. ఏప్రిల్లో జరగనున్న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిబాపూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతుల ఏర్పాట్లపై మంగళవారం ఉదయాదిత్య భవన్లో వివిధ సంఘాల ప్రతినిధులతో ముందస్తు సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
