క్రీడలతో ఆరోగ్యవంతమైన జీవితం : కలెక్టర్ ఇలా త్రిపాఠి

క్రీడలతో ఆరోగ్యవంతమైన జీవితం : కలెక్టర్ ఇలా త్రిపాఠి
  • కలెక్టర్ ఇలా త్రిపాఠి 

హాలియా/ నల్గొండ అర్బన్, వెలుగు: క్రీడల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం లభిస్తుందని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం నాగార్జునసాగర్ మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయంలో ఉమ్మడి జిల్లా స్థాయి అండర్ 14, 19 పోటీలను ఆమె ప్రారంభించారు. అనంతరం కవాతు చేసిన విద్యార్థులను కలెక్టర్​ అభినందించారు. బాలికల, బాలుర పాఠశాలను నిత్యం విజిట్ చేస్తానన్నారు. 

కార్యక్రమంలో గృహ నిర్మాణ సంస్థ పీడీ రాజకుమార్, ఆర్సీవో స్వప్న, ఎంఈవో తరి రాము, డిప్యూటీ ఎమ్మార్వో శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్, వేణు  ప్రిన్సిపల్ రవికుమార్, ఎస్సై ముత్తయ్య పాల్గొన్నారు. అంతకుముందు మౌలానా అబుల్​ కలాం ఆజాద్​ జయంతి, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్​లో  అబుల్​ కలాం ఆజాద్​ ఫొటోకు నివాళులర్పించారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్​ శ్రీనివాస్, ఇన్​చార్జి డీఆర్వో అశోక్​రెడ్డి, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి విజయేందర్​రెడ్డి, డీఈవో భిక్షపతి పాల్గొన్నారు.​ 

ధాన్యం సేకరణపై దృష్టి పెట్టాలి

ధాన్యం సేకరణపై దృష్టి పెట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. నల్గొండలోని తన క్యాంప్ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులు, తహసీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు.  ధాన్యం సేకరణలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల ఇన్​చార్జిలు తేమ శాతాన్ని పరిశీలించి తూకం వేయాలన్నారు.  మిల్లర్లు వచ్చిన ధాన్యాన్ని వెంటనే అన్​లోడ్ చేసుకోవాలన్నారు.

  ట్రక్ షీట్ల జారీ, తూకం, నాణ్యత ప్రమాణాల ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో అగ్రికల్చర్​ ఆఫీసర్లు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అడిషనల్​ కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్, స్థానిక సంస్థల ఇన్​చార్జి, అడిషనల్ కలెక్టర్ నారాయణ అమిత్, ఆర్డీవోలు అశోక్ రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, డీఎస్​వో వెంకటేశ్​, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ గోపికృష్ణ, డీసీవో పత్యానాయక్, డీఆర్డీవో శేఖర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ పాల్గొన్నారు.