నల్గొండ అర్బన్, వెలుగు: కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వడ్లు నాణ్యతగా ఉంటే వెంటనే కొనుగోలు చేయాలని అడిషనల్కలెక్టర్(రెవెన్యూ) శ్రీనివాస్ ఆదేశించారు. తిప్పర్తి మండలంలోని కేశరాజుపల్లిలో పీఏసీఎస్ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు.
17 శాతం తేమ ఉండి, తాలు, తరుగు లేని వడ్ల కొనుగోలులో జాప్యం చేయొద్దని, వర్షం పడితే తడిసిపోతాయని చెప్పారు. అనంతరం అనిశెట్టి దుప్పలపల్లి వద్ద వెంకటేశ్వర రైస్ మిల్లును తనిఖీ చేశారు. వడ్లను వెంటనే అన్లోడ్ చేసుకోవాలని సూచించారు. డీసీవో పత్యా నాయక్, డీఎస్ వో వెంకటేశ్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ గోపికృష్ణ పాల్గొన్నారు.
