వట్టే జానయ్యకు సుప్రీంలో ఊరట.. అరెస్ట్ చెయ్యొద్దంటూ ఉత్తర్వులు

వట్టే జానయ్యకు సుప్రీంలో ఊరట.. అరెస్ట్ చెయ్యొద్దంటూ ఉత్తర్వులు
  • వట్టే జానయ్యకు సుప్రీంలో ఊరట     
  • అరెస్ట్ చెయ్యొద్దంటూ ఉత్తర్వులు
  •  కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర హోంశాఖకు ఆదేశం

సూర్యాపేట, వెలుగు : నల్గొండ డీసీ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ చైర్మన్ వట్టే జానయ్యకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన క్రైమ్ నంబర్ 224 కేసులో అరెస్టు చెయ్యొద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జానయ్యపై నమోదైన 11కేసులలో 10 కేసులకు సంబంధించి అరెస్ట్ చేయకూడదంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే 11వ కేసులో తనను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలంటూ జానయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

జస్టిస్ హరికిషన్ రాయ్, జస్టిస్ సంజయ్ కరోల్ తో కూడిన సుప్రీం కోర్ట్ బెంచ్ సోమవారం ఈ పిటిషన్​ను విచారించింది. రాజకీయ ప్రోద్బలంతో కేవలం ఐదు రోజుల్లో 11 కేసులు నమోదు చేశారని ఆయన తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న జడ్జిలు జానయ్యను అరెస్టు చెయ్యొద్దని, అవసరమైతే 41 ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి విచారణ చేయొచ్చని ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు..

కిడ్నాప్​ కేసులో వట్టే గణేశ్ అరెస్ట్

వట్టే జానయ్య కొడుకు వట్టే గణేశ్ ను కూకట్ పల్లి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సూర్యాపేట లోని గాంధీ నగర్ లో పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం కూకట్ పల్లి కి చెందిన ఇందిరా చక్రవర్తి దంపతులు జానయ్యకు విడతల వారీగా రూ.30 లక్షలు ఇచ్చామని.. డబ్బులు తిరిగి అడిగినందుకు జానయ్య, అతని కొడుకు గణేశ్ తమను కిడ్నాప్ చేశారంటూ గత 29న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబందించిన నోటీసులు తీసుకునేందుకు స్టేషన్ కు వెళ్లిన గణేశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అతని అరెస్టుపై పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదు.